Germany company
-
జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే?
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దూకుడును పెంచింది. జర్మనీకి చెందిన డిజిటల్ మార్కెటింగ్, కమర్షియల్ ఎజెన్సీ ఆడీటీ(oddity)ను కైవసం చేసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ మంగళవారం రోజున ఒక ప్రకటించింది. ఈ ఒప్పందంపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ఆడీటీ కొనుగోలుతో సృజనాత్మక, బ్రాండింగ్, అనుభవ రూపకల్పన వంటి సామర్థ్యాలను బలోపేతం చేస్తోందని ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. ఆడీటీను కైవసం చేసుకునే ప్రక్రియ 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ముగుస్తోందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కంపెనీతో పాటుగా ఏకకాలంలో క్రిస్టాల్ 247ను కూడా ఇన్ఫోసిస్ హస్తగతం చేసుకొనుంది. ఆడీటీను సొంతం చేసుకునేందుకు ఇన్ఫోసిస్ సుమారు 50 మిలియన్ యూరోల(సుమారు రూ. 419 కోట్లు)ను ఖర్చు చేసింది. ఇక క్రిస్టాల్ 247ను కేవలం 3000 యూరోల(సుమారు రెండున్నర లక్షల రూపాయల)ను ఖర్చు చేయనుంది. జర్మనీలో అతి పెద్ద సంస్థగా..! జర్మనీలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీల్లో ఆడీటీ అతి పెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ కంపెనీ స్టుట్గార్ట్, బెర్లిన్, కొలోన్, బెల్గ్రేడ్, షాంఘై, తైపీ వంటి నగరాల్లో 300పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను కలిగి ఉంది. జర్మన్ ఓమ్నీ-ఛానల్, ఈ-కామర్స్ రిటైలర్లు, ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు, గ్లోబల్ మొబిలిటీ ప్రొవైడర్ల కోసం డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేయడం వంటి సర్వీసులను ఆడిటీ అందిస్తోంది. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్, వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, అనుభవంతో సహా అంతర్గత ఉత్పత్తితో కూడిన సమగ్ర సేవా పోర్ట్‌ఫోలియోను ఆడీటీ కల్గి ఉంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..! -
రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దూకుడు..! జర్మన్ కంపెనీ రెడ్డీస్ చేతిలోకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా జర్మనీకి చెందిన నింబస్ హెల్త్‌ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నిశ్చయాత్మక ఒప్పందం కుదిరిందని కంపెనీ గురువారం ప్రకటించింది. అయితే డీల్ విలువను రెడ్డీస్ వెల్లడించలేదు. ఔషధాల తయారీలో ఉపయోగించే గంజాయిని టోకుగా విక్రయించేందుకు నింబస్ హెల్త్‌కు జర్మనీలో లైసెన్స్ ఉంది. సంబంధిత ఔషధాలను ప్రవేశపెట్టేందుకు ఈ కంపెనీ కొనుగోలు దోహదం చేస్తుందని రెడ్డీస్ వెల్లడించింది. ‘అధిక వైద్య అవసరాలను పరిష్కరించడానికి, చికిత్సకు ఔషధ గంజాయిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నొప్పి నివారణ, నరాల సంబంధ సమస్యలకు వినియోగిస్తున్నారు. ఔషధ గంజాయిపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం మేము తప్పనిసరిగా ఉండాల్సిన విభాగం అని నమ్ముతున్నాం’ అని డాక్టర్ రెడ్డీస్ యూరోపియన్ జనరిక్స్ హెడ్ ప్యాట్రిక్ అఘానియన్ తెలిపారు. 2017లో జర్మనీ పార్లమెంట్ చట్టబద్ధం చేయడంతో ఔషధ గంజాయికి కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతోంది. జర్మనీలో ఔషధ గంజాయి విపణి గతేడాది 25 శాతం అధికమై రూ.1,030 కోట్లుంది. చదవండి: విదేశాలకు లక్ష కియా కార్లు -
అపోలో టైర్స్ చేతికి జర్మనీ సంస్థ
రూ.301 కోట్లతో టైర్ల పంపిణీ కంపెనీ రిఫిన్‌కమ్ కొనుగోలు న్యూఢిల్లీ: భారత్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్.. జర్మనీలోని ప్రముఖ టైర్ పంపిణీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన రిఫిన్‌కమ్ జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ దాదాపు రూ.301 కోట్లు (45.6 మిలియన్ యూరోలు). రిఫిన్‌కమ్ ఆరు దేశాల్లో (జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్) ఆన్లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనితోపాటు జర్మనీలో 37 స్టోర్లు, సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది. యూరోప్‌లో వృద్ధి లక్ష్యం...: యూరోప్‌లో వ్యాపారం మరింత వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వ్యాపార అవకాశాలను మెరుగుపరచుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. అన్ని కాలాల్లో అత్యంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థ (సరఫరా నెట్వర్క్) రిఫిన్‌కమ్ విజయానికి ప్రధాన కారణం. ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలు, సేవలను కస్టమర్లకు అందించడానికి అపోలో టైర్స్‌కు పూర్తిగా సహకరిస్తామని రిఫిన్‌కమ్ మేనేజింగ్ డెరైక్టర్లు ఓలాఫ్ స్కాయిల్, హికో నిగ్స్ తెలిపారు. తాజా పరిణామం నేపథ్యంలో సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అపోలో టైర్స్ షేర్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 1.68 శాతం ఎగసి (రూ.2.60) రూ.157.70కి చేరింది.