రెండోరోజు మహిళా ఎంపీల తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ : మహిళల వస్త్రధారణపై టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. మురళీ మోహన్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెద్దల సభ ప్రారంభమైన వెంటనే మురళీ మోహన్ వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను 15 నిమిషాలు వాయిదా పడింది.