digree
-
ప్రియుడి స్థానంలో డిగ్రీ పరీక్షకు ప్రేయసి.. ప్రభుత్వ ఉద్యోగం ఫసక్!
గాంధీనగర్: ఒకరికకి బదులు ఒకరు పరీక్షలు రాసిన సంఘటనలు చాలానే వెలుగు చూశాయి. కవల పిల్లల్లో అలాంటివి ఎక్కువ జరుగుతాయి. అయితే, ఓ అబ్బాయి స్థానంలో అమ్మాయి పరీక్షలు రాసే ప్రయత్నం చేసింది. చివరకు తన డిగ్రీ కోల్పోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసి కళాశాల అధికారులతో పాటు తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తన బాయ్‌ఫ్రెండ్ ఉత్తరాఖండ్‌కు వెకేషన్‌కు వెళ్లగా అతడి స్థానంలో పరీక్షలు రాసేందుకు హాజరైంది. థర్డ్ ఇయర్ బీకామ్ పరీక్షల్లో తన ప్రియుడి స్థానంలో డమ్మీ క్యాండిడేట్‌గా కూర్చుంది 24 ఏళ్ల యువతి. అయితే, పరీక్ష రాసే క్రమంలో పట్టుబడింది. ఇదీ జరిగింది.. అక్టోబర్‌లో జరిగిన బీకామ్ థర్డ్ఇయర్ పరీక్షల్లో ఒకరోజు అబ్బాయి స్థానంలో అమ్మాయి కూర్చింది. హాల్‌టికెట్‌లోనూ అమ్మాయి ఫోటో, పేరు ఉన్నాయి. ఎవరూ గుర్తించలేదు. కానీ, అదే హాల్లో పరీక్ష రాస్తున్న మరో విద్యార్థి అనుమానించాడు. ఆ స్థానంలో ప్రతిరోజు అబ్బాయి ఉంటాడని, ఆ రోజు అమ్మాయి ఉండటంపై ఇన్విజిలేటర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతిని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఫెయిర్ అసెస్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ ముందు హాజరుపరిచారు. ఆ కమిటీ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది నిందితురాలు. ‘ఆ యువతి, యువకుడికి స్కూల్ నుంచే పరిచయం ఉన్నట్లు తెలిసింది. అయితే, పరీక్షలకు హాజరయ్యే విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.’ అని కమిటీ పేర్కొంది. విచారణ సందర్భంగా.. కంప్యూటర్లో హాల్‌టికెట్‌ను మర్చి పరీక్ష హాల్లోకి ప్రవేశించినట్లు ఒప్పుకుంది నిందితురాలు. ఇన్విజిలేటర్ రోజు మారతారు. విద్యార్థులతో పెద్దగా వారికి పరిచయం ఉండకపోవడంతో విద్యార్థులను గుర్తించలేరు. ఇదే ఆ యువతికి అనుకూలంగా మారింది. అసలు పరీక్షకు హాజరుకావాల్సిన అబ్బాయిని పిలిపించిన కమిటీ విచారించింది. తాను పరీక్ష రోజున ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్లు తెలిపాడు. థర్డ్ఇయర్ బీకామ్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మరోవైపు.. ఎఫ్ఏసీటీ కమిటీ సిఫార్సుల మేరకు ఆ యువతి బీకామ్ డిగ్రీని, యువకుడి తొలి, రెండో ఏడాది పరీక్షలను సైతం రద్దు చేసినట్లు ఎఫ్ఏసీటీ సభ్యురాలు ఒకరు తెలిపారు. . దీంతో ఆ యువతి ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకునే ప్రమాదం తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు
జైపూర్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ ఏడాది అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కాలేజీల్లో జరగవల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలతోపాటు టెక్నికల్ ఇన్స్టిట్యూట్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు. (ఏడాది పాటు మాస్క్‌లు తప్పవు) ఇక విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా వచ్చే సంవత్సరానికి ప్రమోట్ అవుతారని అన్నారు. విద్యార్థుల మార్కులకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరి కొద్ది రోజుల్లో జారీ చేయాల్సిన మార్గదర్శకాలను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల రాజస్థాన్ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ పరీక్షలను జూలై 15 నుంచి ఆగస్టు 18 వరకు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. (వెంటిలేటర్ల ఎగుమతికి సిద్ధం : డీఆర్డీఓ) -
డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకొనే విద్యార్థులు జూలై 1 నుంచి 14 వరకు రూ. 200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో( https:// dost.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఇంటర్ హాల్‌టికెట్ నంబర్‌తో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన దోస్త్ కమిటీ సమావేశంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నోటిఫికేషన్ జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఒకరినొకరు ముట్టుకోకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌కు బదులు రియల్‌టైమ్ డిజిటల్ ఫేస్ రికగ్నైజేషన్ టీ–యాప్ ఫోలియోను ప్రవేశపెట్టింది. ఇదీ తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి పాసైన విద్యార్థులకే వర్తిస్తుంది. విద్యార్థులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఇంటర్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, సెల్ఫీ ఫొటో ద్వారా ‘దోస్త్’ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ గ్రీవెన్స్ కోసం 7901002200 వాట్సాప్ చాట్‌బాత్ (ఆటో రెస్పాండర్)ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా వివరాలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రధాన అంశాలు.. ఇదివరకే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌గల విద్యార్థులు నేరుగా దోస్త్ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ కాకపోతే తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొనే వెసులుబాటు ఉంది. విద్యార్థులు టీ–యాప్ ఫోలియో యాప్ (ఫేషియల్ రికగ్నిషన్) ద్వారా సెల్ఫీతోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేని వాళ్లు, ఆధార్‌తో మొబైల్ లింక్‌లేని వాళ్లు వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకొని దోస్త్ హెల్త్‌లైన్ లేదా దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ లేదా మీసేవా సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటిసారి రిజిస్ట్రేషన్‌కు రూ. 200 చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థికి దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వస్తుంది. వాటిని ఉపయోగించి దరఖాస్తు ఫారం ఓపెన్ చేసి వివరాలు నింపాలి. ఆ తరువాత విద్యార్థులు కోర్సులవారీగా, కాలేజీలవారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కోరుకున్న కాలేజీలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా విద్యార్థి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లను కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థి ఆగస్టు 20 నుంచి 24 మధ్య కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లను సమర్పించి ఫీజు చెల్లించాలి. అప్పుడే ఆ విద్యార్థికి ఆ సీటు ఉంటుంది. మొదటి కౌన్సెలింగ్‌లో విద్యార్థికి వచ్చిన సీటు, కాలేజీ నచ్చకపోయినా సీటు రిజర్వేషన్ కోసం ఆన్లైన్లో మాత్రమే ఫీజు చెల్లించాలి. ఆ తరువాత తదుపరి దశల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ అర్హతగల వారు 2019 ఏప్రిల్ 1 లేదా ఆ తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి. ఈ–సేవా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. యూనివర్సిటీ/ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లభించిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కు డబ్బలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు రూ. 500 చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాని వారు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో రూ. 1,000 చెల్లించాలి. ఇదీ షెడ్యూల్.. 1–7–2020 నుంచి 14–7–2020: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ (ఫీజు రూ. 200) 6–7–2020 నుంచి 15–7–2020: వెబ్ ఆప్షన్లు 13–7–2020: స్పెషల్ కేటగిరీ (పీహెచ్, క్యాప్) అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 14–7–2020: ఎన్సీసీ, ఎక్స్ట్రాకరిక్యులర్ (స్పెషల్ కేటగిరీ) వెరిఫికేషన్ 22–7–2020: మొదటి దశ సీట్ల కేటాయింపు 23–7–2020 నుంచి 27–7–2020: ఆన్లైన్లో విద్యార్థులు కాలేజీ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం. 23–7–2020 నుంచి 29–7–2020: రెండో దశ రిజిస్ట్రేషన్లు (ఫీజు రూ. 400) 23–7–2020 నుంచి 30–7–2020: రెండో దశ వెబ్ ఆప్షన్లు 29–7–2020: వర్సిటీల హెల్ప్‌లైన్ కేంద్రాల్లో అన్ని సెల్ఫ్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 7–8–2020: రెండో దశ సీట్లు కేటాయింపు 8–8–2020 నుంచి 12–8–2020: ఆన్లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ 8–8–2020 నుంచి 13–8–2020: మూడో దశ రిజిస్ట్రేషన్లు (ఫీజు రూ. 400) 8–8–2020 నుంచి 14–8–2020 వరకు: మూడో దశ వెబ్ ఆప్షన్లు 13–8–2020: యూనివర్సిటీల హెల్ప్‌లైన్ కేంద్రాల్లో అన్ని సెల్ఫ్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 19–8–2020: మూడో దశ సీట్లు కేటాయింపు 20–8–2020 నుంచి 21–8–2020: ఆన్లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ 20–8–2020 నుంచి 24–8–2020: అన్ని దశల్లో సీట్లు కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయడం 24–8–2020 నుంచి 31–8–2020: కాలేజీల్లో ఓరియెంటేషన్ కార్యక్రమాలు 1–9–2020 నుంచి: మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ఖమ్మంక్రైం : ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తాను ఉంటున్న హాస్టల్లోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించిం ది. కళాశాల నిర్వాహకుల వేధింపులతో విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కురవి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పగడాల భవాని(19) నెహ్రూ నగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సంబంధించిన హాస్టల్లోనే ఉంటోం ది. ఈ క్రమంలో బుధవారం కళాశాలలో రెండు పిరి యడ్ల తర్వాత ఇంటర్వెల్ సమయంలో తాను ఉంటున్న హాస్టల్ గదికి వచ్చింది. ఆ సమయంలో హాస్టల్లో స్వీపర్ మాత్రమే ఉంది. హాస్టల్ గదికి వెళ్లిన భవాని ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో స్వీపర్ ఆమె ఉంటున్న గది వద్దకు వెళ్లి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్వీపర్ కేకలు వేస్తూ కళాశాల సిబ్బందిని పిలవడంతో వారు హుటాహుటిన వచ్చి తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే భవాని మృతిచెందింది. దీంతో కళాశాల సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారమివ్వగా సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఓంకార్‌యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ కుమార్తె కళాశాల సిబ్బంది వేధింపుల వల్లనే చనిపోయిందని, కావాలనే లేఖను పక్కన పెట్టారని, మృతదేహాన్ని వెంటనే తరలించడం ఏమిటని ఆందోళన చేశారు. భవాని కుటుంబానికి న్యాయం చేసి కళాశాలపై చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల, మార్చురీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం భవాని మృతిపై విచారణ చేస్తామని కుటుంబ సభ్యులకు పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మార్చురీ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళా పోలీస్‌స్టేన్న్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.