Digvesh Singh Rathi
-
ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అండగా నిలిచాడు. రాఠీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించాడు. కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్‌ను ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో లక్నో రూ. 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది.25 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌పై నమ్మకంతో సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రంలోనే దిగ్వేశ్ రెండు వికెట్లు తీసి మేనేజ్మెంట్ అంచనాలు నిజం చేశాడు.‘నోట్‌బుక్’ సంబరాలుఆ తర్వాత కూడా రాణించిన దిగ్వేశ్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్ అయింది. బ్యాటర్‌ను అవుట్ చేయగానే.. అతడి దగ్గరికి వెళ్లి నోట్‌బుక్‌లో వికెట్ నంబర్ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలక మండలి.. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా దిగ్వేశ్ రాఠీ మరోసారి ఇదే రీతిలో వికెట్ తీసిన సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఈసారి మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధించడంతో పాటు మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది. మూడోసారి ఇది రిపీట్ అయితే.. మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పచ్చిక మీద సంతకంఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మాత్రం దిగ్వేశ్ తన శైలిని మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్ తీసిన అనంతరం ‘నోట్ బుక్’ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తన ఆరాధ్య ప్లేయర్ సునీల్ నరైన్ వికెట్ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకొన్నాడు. ఏడో ఓవర్ రెండో బంతికి నరైన్‌ను అవుట్ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు.Apne idol ka hi chalaan kaat diya 😌😂 pic.twitter.com/HuoxZJj1DX— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?ఈ పరిణామాలపై కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. ‘‘ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది. నాకైతే ఇదేమీ నచ్చడం లేదు. నిజానికి అతడు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది. అసలు అతడు చేసిన తప్పేంటి?ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు. కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష?.. నోట్‌బుక్ సంబరాలను తప్పుపట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అని డౌల్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న దిగ్వేశ్ సింగ్ రాఠీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు.. లక్నో జట్టు ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిచింది.చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ వేసింది.దిగ్వేశ్‌కి మరోసారి షాక్అదే విధంగా.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీకి ఐపీఎల్ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జతచేసింది.203 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్ఎస్జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53), ఆయుశ్ బదోని (30), డేవిడ్ మిల్లర్(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పన్నెండు పరుగుల తేడాతోఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (24 బంతుల్లో 46), సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్‌లోకి అదనంగా ఓ ఫీల్డర్‌ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్‌కు జరిమానా కూడా పడింది.స్లో ఓవర్ రేటు ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందు వల్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. దిగ్వేశ్ సింగ్ రాఠీ విషయంలోనూ ఐపీఎల్ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.మళ్లీ అదే తప్పుఆర్టికల్ 2.5లోని లెవల్ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ దిగ్వేశ్ రూల్స్ ఉల్లంఘించాడు. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు తాజాగా మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్కు ఫైన్ వేయడానికి గల కారణం.. నమన్ వికెట్ తీసిన తర్వాత.. మరోసారి నోట్‌బుక్‌లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అని తెలుస్తోంది.నువ్విక మారవా? .. పాపం పంత్!కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే దిగ్వేశ్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్ ధీర్ రూపంలో కీలక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్‌పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్‌గా విఫలమవుతున్న పంత్‌కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్ Just the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాకిచ్చింది. వికెట్ తీసిన సంబరంలో ‘అతి’ చేసినందుకు గానూ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్ ఆడింది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27) రాణించారు.అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరవగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ప్రియాన్ష్ ఆర్య విఫలంఇక లక్ష్య ఛేదన మొదలుపెట్టిన కాసేపటికే పంజాబ్.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా.. సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌కు తగిలింది. అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతిని.. మిడాన్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ ఒడిసిపట్టాడు.రాఠీ ‘ఓవరాక్షన్’ఈ క్రమంలో మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, అతడు క్రీజు వీడుతున్న సమయంలో దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన దిగ్వేశ్ రాఠీ ‘ఓవరాక్షన్’ చేశాడు. పుస్తకంలో అతడి పేరును రాసుకుంటున్నట్లుగా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.#DigveshRathi provides the breakthrough as #PriyanshArya heads back!P.S: Don't miss the celebration at the end! 👀✍🏻Watch LIVE action of #LSGvPBKS ➡ https://t.co/GLxHRDQajv#IPLOnJiostar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! | #IndianPossibleLeague pic.twitter.com/TAhHDtXX8n— Star Sports (@StarSportsIndia) April 1, 2025 ఈ నేపథ్యంలో దిగ్వేశ్ రాఠీ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది. జరిమానా‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5లో గల లెవల్ 1 నిబంధనను దిగ్వేశ్ రాఠీ అతిక్రమించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ జతచేసినట్లు వెల్లడించింది.కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.పంజాబ్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన ఆనందం లక్నోకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) ధనాధన్ దంచికొట్టి అజేయంగా ఇన్నింగ్స్‌తో.. జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!