Dilwale movie
-
అందుకే అబ్‌రాంకు కాజోల్ అంటే నచ్చదు: షారుక్
బాలీవుడ్ ఆన్‌స్క్రీన్ పాపులర్ పేర్లో షారుక్ ఖాన్-కాజోల్ అగ్రస్థానంలో ఉంటారు. తెరపై ఈ జంట పండించే ప్రేమకు సినీ ప్రేమికులంత ఫిదా అవ్వక తప్పదు. దీనికి ఉదాహరణ వారిద్దరూ నటించిన ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే, బాజీగర్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్’ చిత్రాలే. ఈ మూవీలో ప్రేమికులుగా ఈ జంట వందకు వంద శాతం మార్కులు కొట్టేశారు. అంతేగాక వారిద్దరూ నటించిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అందుకే షారుక్-కాజోల్ హిట్ పెయిర్‌గా నిలిచారు. చదవండి: రోహన్‌తో శ్రద్ధా కపూర్ ప్రేమ వ్యవహరం, స్పందించిన శక్తి కపూర్ ఇక ఆ తర్వాత సుదీర్ఘ విరామంతో తర్వాత వీరిద్దరూ ‘దిల్వాలే’ మూవీతో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. 2015లో వచ్చి ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ ‘దిల్వాలే’ మూవీ సమయంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నాడు. కాగా షారుక్ ఎటు వెళ్లిన అతడి చిన్న కుమారుడు అబ్రాంను వెంట తీసుకుని వెళ్తాడనే విషయం తెలిసిందే. అయితే దిల్వాలే మూవీ షూటింగ్‌కు కూడా అబ్రాంను ప్రతి రోజు సెట్‌కు తీసుకుని వెళ్లవాడట. కాగా, తన చిన్న కుమారుడు అబ్‌రాంకు కాజోల్ అంటే ఇష్టం ఉండేది కాదంటూ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?! ‘ప్రతి రోజు లాగే ఓ రోజు అబ్రాంను తీసుకుని ‘దిల్వాలే’ షూటింగ్‌కు వెళ్లాను. షూటింగ్ అనంతరం డైరెక్టర్ రోహిత్ శెట్టి ఆ రోజు సన్నివేశాలను కెమెరాలో చూపించేవాడు. ఈ మూవీలో నేను గాయపడిన సన్నివేశం ఆ రోజు చిత్రీకరించారు. అది చూపించేటప్పుడు ఆ సీన్ చూసి అబ్రాం ఆ గాయాలు నాకు కాజోల్ వల్లే అయ్యాయని భావించాడు. దీంతో కాజోల్ పట్ల కోపం తెచ్చుకున్నాడు. ‘పాపా తూత్ గయా(నాన్నకు దెబ్బ తగిలింది) అంటూ కాజోల్ వంక సీరియస్‌గా చూస్తూ గట్టిగా అరిచాడు. ఇక అప్పటి నుంచి కాజోల్ నేను మాట్లాడుకున్న, మేము ఇద్దరం కలిసి కనిపించిన వాడికి నచ్చేది కాదు. స్రీన్‌పై కూడా తనతో నన్ను చూసినప్పుడు అబ్రాం గుర్రుగా చూస్తుంటాడు. ఇప్పుడు అది గుర్తు చేసుకుంటుంటే చాలా సరదాగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్, సంకి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. -
'నిజమే సినిమా కలెక్షన్ తగ్గింది'
కోల్ కతా: దేశంలో మత అసహనం పెరిగిపోతుదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' సినిమా కలెక్షన్లపై పడడంతో విచారం వ్యక్తం చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వక్రీకరించారని వాపోయాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా వచ్చిన షారూఖ్ మీడియాతో మాట్లాడాడు. 'అసహనంపై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనుకోవడం లేదు. వివరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. నా కళ్లతో చూసిందే నేను మాట్లాడాను. నా గురించి ప్రజలకు తెలుసు. అయితే నేను మాట్లాడినదాన్ని వారు అర్థం చేసుకోలేదు. నా వ్యాఖ్యలను సరిగా ప్రజెంట్ చేయలేదు. నా మాటలతో ఎవరైనా బాధపడివుంటే విచారం వ్యక్తం చేస్తున్నా' అని షారూఖ్ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' కలెక్షన్లపై పడిందని అతడు అంగీకరించాడు. వివాదాల జోలికి పోకుండా తన సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రాంతం, కులం, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ తనను 25 ఏళ్లుగా ఆదరిస్తున్నారని తెలిపాడు. తన సినిమాల ద్వారానే తన ప్రేమను వారికి తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. కొంతమంది దుష్ప్రచారం చేసినంతమాత్రానా తన దేశభక్తిని శంకించాల్సిన పనిలేదన్నాడు. -
'ఆమెతో నటించడం వాడికి ఇష్టం లేదు'
ముంబై: షారూఖ్ ఖాన్- కాజోల్ జోడికి సినీ అభిమానులంతా నీరాజనాలు పడుతుంటే ఓ బుడతడికి మాత్రం ఈ జంట నచ్చలేదట. ఈ చిన్నారి ఎవరో కాదు షారూఖ్ ముద్దులకొడుకు అబ్ రామ్. కాజోల్ తో తాను కలిసి నటించడం తన చిన్న కొడుకు ఇష్టపడడం లేదని స్వయంగా షారూఖ్ వెల్లడించాడు. తమ జోడి అతడికి నచ్చలేదని తెలిపాడు. ఐదేళ్ల తర్వాత 'దిల్ వాలే' కోసం షారూఖ్, కాజోల్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. కొన్ని సీన్లు అబ్ రామ్ కు నచ్చలేదని తెలిపాడు. ముఖ్యంగా కాజోల్ కారణంగా తాను గాయపడే సీన్ అసలు నచ్చలేదని చెప్పాడు. ఈ కారణంగానే కాజోల్ తో తాను నటించడాన్ని ఒప్పుకోవడం లేదని, తమ జోడి రెండేళ్ల తన కొడుక్కి నచ్చలేదని వివరించారు. అబ్ రామ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోనని చెప్పారు. తన కంటే అబ్ రామస్ ఫేమస్ అయిపోతున్నాడని, అందుకే అతడి ఫొటోలో ట్విటర్ లో పెట్టడడం లేదని సరదాగా అన్నారు. బాలీవుడ్ లో షారూఖ్- కాజోల్ జోడి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫెయిర్ గా పేరుగాంచింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు వియవంతమయ్యాయి. వీరిద్దరూ చివరిసారిగా 2010లో 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమాలో నటించారు. -
మన'సైనా' కోరిక తీరనుంది!
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన మనసులోని కోరికను బయటపెట్టింది. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కలవాలని ఉందని వెల్లడించింది. షారూఖ్ తాజా చిత్రం 'దిల్ వాలే' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈవిషయం తెలిసి షారూఖ్ ను కలవాలని ఉందని సైనా ట్వీట్ చేసింది. 'హలో సర్.. మీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని తెలిసింది. మిమ్మల్ని కలవాలని ఉంది' అని సైనా ట్వటర్ లో పోస్ట్ చేసింది. దీనికి షారూఖ్ వెంటనే స్పందించారు. తనను కలుసుకోవడానికి సమయం చెప్పాలని సైనాకు సూచించారు. వెంటనే స్పందించిన సైనా శుక్రవారం కలుస్తానని సమాధానం ఇచ్చింది. షారూఖ్ సరసన నటిస్తున్న కాజోల్ ను ఇప్పటికే కలిసిన సైనా ఆ ఫోటోను ట్విటర్ లో షేర్ చేసింది. కాజోల్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న 'దిల్ వాలే'లో వరుణ్ ధావన్, కృతి సనన్, బొమన్ ఇరానీ, వినోద్ ఖన్నా, సంజయ్ మిశ్రా, జానీ లివర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.