diplomatic war
-
దౌత్య సిబ్బందిపై భారత్ అల్టిమేటం.. స్పందించిన కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సిబ్బంది సంఖ్యను తగ్గించాలంటూ కేంద్రం చేసిన అల్టిమేటమ్‌పై కెనడా ప్రభుత్వం స్పందించింది. రెండు దేశాల మధ్య ధైత్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము భారత ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు కెనడా విదేశీ వ్యవహరాలమంత్రి మెలానీ జోలీ పేర్కొన్నారు. ఇందుకు కెనడా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కెనడియన్ దౌత్యవేత్తల భద్రతను తాము చాలా సీరియస్‌గా(తీవ్రమైనవి) తీసుకుంటున్నామని, భారత్‌తో ప్రైవేట్‌గా చర్చలు జరపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే వ్యక్తిగత దౌత్యపరమైన సంభాషణలు ఉత్తమమైనవిగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం 10లోగా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించండి: కెనడాకు భారత్ అల్టిమేటమ్ కాగా భారత్‌లో ఉన్న దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కెనడా హైకమిషనరేట్‌కు భారత్ అల్టిమేటమ్ జారీ చేసిన విషయం తెలిసిందే భారత్‌లో ఉన్న సుమారు 41 మంది దౌత్యవేత్తల్ని వెనక్కి తీసుకువెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 10 వరకు గడువు విధించినట్టు విశ్వసనీయమైన వర్గాల సమాచారం. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని భారత్ ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని చెబుతోంది. ప్రస్తుతం భారత్‌లో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. అందులో 41 మందిని తగ్గించాలంటూ కెనడా రాయబార కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఒకవేళ గడువులోగా దౌత్యవేత్తల్ని వెనక్కి పిలవకపోతే వారికి రక్షణ కల్పించలేమని కూడా ప్రభుత్వం తెగేసి చెప్పినట్టుగా సమాచారం. వివాదాన్ని పెంచాలనుకోవడం లేదు: కెనడా భారత్‌తో వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. భారత్‌తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా తమ బంధాన్ని కొనసాగిస్తామని అన్నారు. భారతదేశంలోని కెనడియన్ కుటుంబాలకు సహాయం చేసేందుకు తాము అక్కడే ఉండాలని అనుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన అనంతరం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం -
ప్రతీకార చర్యలు ప్రారంభించిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా మధ్య దౌత్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికాలోని హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ జనరల్‌ను మూసివేయించడంతో చైనా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆగ్నేయ సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్‌ను మూసివేయాలని ఆదేశించినట్టు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘చైనా అమెరికా మధ్య సంబంధాలు ఇలా క్షీణించాలని మేము కోరుకోవడం లేదు. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం’’అని ఆ ప్రకటన పేర్కొంది. భద్రతకు భంగం కలిగిస్తున్నారు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ గూఢచర్య ఆరోపణలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించినట్టుగానే చైనా కూడా అదే బాటలో నడిచింది. చెంగ్డూ కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకుంటూ దేశ భద్రతా ప్రయోజనాలకు హాని తలపెడుతున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. హ్యూస్టన్‌లో కాన్సులేట్ మూసివేయాలన్న అమెరికా నిర్ణయానికి ఇది సరైన ప్రతిస్పందనని ఆయన అన్నారు. తమ నిర్ణయం చట్టబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకి వ్యూహాత్మక ప్రాంతం చెంగ్డూలో అమెరికా కాన్సులేట్‌ని 1985లో ప్రారంభించారు. అందులో 200మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 150 మందికిపైగా స్థానికులే. సమస్యాత్మక ప్రాంతమైన టిబెట్ గురించి సమాచారాన్ని సేకరించడానికి చెంగ్డూలో కాన్సులేట్ అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. అంతేకాదు హ్యూస్టన్‌లో చైనా కాన్సులేట్ ఎంత పెద్దదో, ఎందరు ఉద్యోగులు ఉంటారో, సరిగ్గా చెంగ్డూలో కూడా అంతే మంది పనిచేస్తారు. వాటి ప్రాధాన్యాలు కూడా ఒకటే. తొలుత వూహాన్లో అమెరికా కాన్సులేట్ మూసివేయాలన్న ఆదేశాలిస్తారని భావించారు కానీ చెంగ్డూ అయితేనే దెబ్బకి దెబ్బ తీసినట్టు అవుతుందని చైనా ప్రభుత్వం భావించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో చైనా విద్యార్థుల అరెస్ట్ వీసాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నలుగురు చైనీయులపై కేసు నమోదు చేసింది. వీరు చైనా సైన్యంలో పనిచేసినప్పటికీ, ఆ వివరాలు దాచిపెట్టి, రీసెర్చ్ కోసం అమెరికాకి వచ్చినట్టు ఆరోపించింది. ఇందులో ముగ్గురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేయగా, నాలుగో వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్ కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వారు చెప్పారు. వీరందరిపై వీసా మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. నేర నిరూపణ అయితే పదేళ్ల జైలు శిక్ష, రూ.1.88 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
పాక్‌పై దౌత్య యుద్ధం
న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ వంటి ఉగ్రమూకలకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్ సహా 25 దేశాల దౌత్యాధికారులకు పుల్వామా ఉగ్రదాడి జరిగిన తీరును భారత్ వివరించింది. ఉగ్రవాదాన్ని విదేశీ విధానంగా మలుచుకున్న పాక్ వ్యవహారశైలిని ఎండగట్టింది. ఢిల్లీలోని తన కార్యాలయానికి రావాల్సిందిగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహమూద్‌కు భారత విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. దాడిపై ఆయన తీవ్ర నిరసనను తెలియజేశారు. జైషేకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సత్వరం, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసూద్‌కు చైనా మద్దతు బీజింగ్: దాడికి పాల్పడిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ప్రపంచ ఉగ్రవాదిగా ముద్ర వేయించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి తాము మద్దతు తెలపబోమని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడారు. మసూద్ అజార్‌పై ‘పంచ ఉగ్రవాది’ ముద్ర వేసే విషయంలో చైనా వైఖరేంటని ప్రశ్నించగా, ‘ఐరాస భద్రతా మండలి నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. జైషే మహ్మద్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే భద్రతా మండలి గుర్తించి ఆంక్షలు విధించింది’ అని చెప్పారు. మసూద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు భద్రతా మండలిలో వీటో అధికారాలున్న చైనా అడ్డుతగులుతోంది. -
రష్యా–బ్రిటన్ మధ్య ముదిరిన దౌత్య యుద్ధం
మాస్కో: రష్యా మాజీ గూఢచారిపై హత్యాయత్నం నేపథ్యంలో బ్రిటన్, రష్యాల మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తమ సిబ్బందిని బహిష్కరించినందుకు ప్రతిగా మరో 50 మంది దౌత్య ప్రతినిధుల్ని తగ్గించుకోవాలని బ్రిటన్‌కు రష్యా స్పష్టం చేసింది. బ్రిటన్‌లో నివసిస్తున్న రష్యా మాజీ ఏజెంట్ సెర్గె స్క్రిపాల్, అతని కుమార్తె యులియాపై విష ప్రయోగం తర్వాత బ్రిటన్, దాని మిత్రదేశాలు తమ దేశాల్లోని రష్యా దౌత్య సిబ్బందిని పెద్ద ఎత్తున బహిష్కరించిన సంగతి తెల్సిందే. ప్రతిగా రష్యా ఇప్పటికే 23 మంది బ్రిటన్ ప్రతినిధుల్ని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించగా.. తాజాగా మరో 50 మంది సిబ్బందిని వెనక్కి పిలిపించాలని కోరింది. మాస్కోలోని బ్రిటిష్ రాయబారిని తన కార్యాలయానికి పిలిపించుకున్న రష్యా విదేశాంగ శాఖ ఎంతమంది రష్యా ప్రతినిధుల్ని బహిష్కరించారో అంతే సంఖ్యలో బ్రిటన్ తన సిబ్బందిని తగ్గించుకోవాలని తేల్చిచెప్పింది. 23 దేశాల రాయబారులకు ఆ దేశాల దౌత్య సిబ్బంది రష్యా విడిచి వెళ్లాలని ఆదేశించింది. -
దౌత్య యుద్ధం!
పెద్దవాళ్ల దగ్గర వినయంగా, విధేయతగా, అణకువగా మెలగడం మంచి లక్షణమంటారు. ఆ పెద్దవాళ్లు తమ పెద్దరికం నిలుపుకునేంతవరకూ... చిన్నవాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనంతకాలమూ ఇది నిజంగా మంచి లక్షణమే. ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నా అగ్రరాజ్యం అమెరికా దగ్గర దశాబ్దాలుగా వినయాన్ని, విధేయతనూ ప్రదర్శించడం మాత్రమే అలవాటైన మన పాలకులు తొలిసారి జూలువిదిల్చారు. అమెరికాపై దౌత్యయుద్ధానికి దిగారు. న్యూయార్క్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే విషయంలో అతిగా ప్రవర్తించిన అమెరికా చర్యను నిరసిస్తూ వరస చర్యలు తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రతినిధి బృందాన్ని కలవడానికి లోక్‌సభ స్పీకర్ మొదలుకొని జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ వరకూ అందరూ నిరాకరించారు. నరేంద్రమోడీనుంచి రాహుల్‌గాంధీ వరకూ అధికార, విపక్ష నేతలందరూ తొలిసారి ఒకే మాట మాట్లాడారు. అంతేకాదు... మన ప్రభుత్వం అమెరికా రాయబార కార్యాలయంవద్ద చాన్నాళ్లుగా ఉంటున్న బారికేడ్లను తీయించింది. అమెరికా దౌత్యకార్యాలయాల్లో, వారి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాల వివరాలూ, వారి బ్యాంకు ఖాతాల వివరాలూ ఇవ్వాలని హుకుంజారీచేసింది. అమెరికా సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకూ ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు కార్డుల్ని వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇన్నాళ్లుగా అమెరికా దౌత్య సిబ్బంది అనుభవిస్తున్న ప్రత్యేక సౌకర్యాలన్నిటికీ స్వస్తి పలికింది. అంతక్రితం భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి దేవయాని విషయంలో వ్యవహరించిన తీరుకు తీవ్ర నిరసనను, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్యల్లో ఉక్రోషం కనబడవచ్చు. ఉద్రేకం కనబడవచ్చు. మనవాళ్లలో తరచుగా దర్శనమిచ్చే నెమ్మదితనం మాయమైనట్టు అనిపించవచ్చు. కానీ, ఎప్పుడూ మృదువుగానే మాట్లాడదామనుకుంటే కుదరదు. మంద్రంగా ఉన్నా సరిపోదు. ఒక్కోసారి పొలికేక అవసరమవుతుంది. చెవులు చిల్లులుపడేలా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు మన దేశం ఆ పనేచేసింది. దేవయాని ఖోబ్రగడే తనవద్ద పనిచేయించడానికి భారత్‌నుంచి తీసుకెళ్లిన సహాయకురాలికి చట్టప్రకారం ఇవ్వాల్సిన వేతనంకంటే తక్కువ ఇచ్చారని, ఆమెకు సంబంధించిన వివరాలను అందజేయడంలో మోసానికి పాల్పడ్డారని అమెరికా ప్రధాన ఆరోపణలు. మన ప్రభుత్వం దౌత్యకార్యాలయాల్లో చెల్లించమని నిర్దేశించిన వేతనాన్నే సహాయకురాలికి చెల్లించామని దేవయాని తండ్రి చెబుతున్నారు. దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానికి మన ప్రభుత్వం చెల్లించే వేతనం నెలకు 4,120 డాలర్లుకాగా, తమ చట్టాల ప్రకారం సహాయకురాలికి ఆమె నెలకు 4,500 డాలర్లు చెల్లించి తీరాలని అమెరికా చేస్తున్న వాదన. ఇందులో సహేతుకత ఏపాటో విచారణ తర్వాత తేలుతుంది. కానీ, ఆ ఆరోపణలను ఆసరాచేసుకుని దేవయానిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. పిల్లల్ని దించడానికి పాఠశాలకు వెళ్తే అక్కడికక్కడే ఆమెను చుట్టుముట్టి నిర్బంధంలోకి తీసుకుని సంకెళ్లువేశారు. అటు తర్వాత తమ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమె దుస్తులు తీయించి తనిఖీచేశారు. అనంతరం ఆమెను మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్నవారితోపాటు బంధించారు. డీఎన్ఏ శాంపుల్ తీసుకున్నారు. న్యాయస్థానం ఆమెకు బెయిల్ ఇచ్చేలోగానే ఇవన్నీ జరిగిపోయాయి. భారత్ వ్యక్తం చేసిన నిరసన చెవికెక్కకపోగా తమ అధికారులను అమెరికా సమర్థించుకో జూసింది. దేవయాని చేసిన పని దౌత్యవేత్తగా ఆమె విధుల్లో భాగం కాదు గనుక దౌత్యవేత్తలకు వర్తించే వియన్నా ఒప్పందంలోని అంశాలు ఆమెకు వర్తించబోవని దబాయించింది. నిజానికి అమెరికా మన దేశానికి సంబంధించిన ప్రముఖులతో ఇలా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఒకటికి రెండుసార్లు తనిఖీల పేరుతో అవమానించారు. అంతక్రితం అప్పటి ప్రధాని వాజపేయికి, అప్పటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్, విదేశాంగ శాఖ మాజీమంత్రి ఎస్ఎం కృష్ణలకు కూడా ఇలాగే జరిగింది. సుప్రసిద్ధ నటులు షారుఖ్ ఖాన్ , కమల్‌హాసన్‌లకు ఇదే పరాభవం ఎదురైంది. గత మూడేళ్లలో మన దౌత్యవేత్తలను వేర్వేరు కారణాలతో ఇలా వేధించడం ఇది మూడోసారి. ఈ వరస అవమానాలను ఎప్పటికప్పుడు దిగమింగుకోవడం, ఆగ్రహించినవారికి సర్దిచెప్పుకోవడం మన పాలకులకు అలవాటైంది. ఇప్పుడు దేవయాని ఘటన జరిగాక చేపట్టిన చర్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ దౌత్య కార్యాలయానికైనా పటిష్టమైన భద్రత కల్పించడం సాధారణమే. కానీ, అమెరికా దౌత్య కార్యాలయం వెలుపల బారికేడ్ల నిర్మాణం ఆ పరిమితిని మించిపోయిందని ఇప్పుడు తీసుకున్న చర్యలనుబట్టి అర్ధమవుతుంది. ఎంత మిత్ర దేశమనుకున్నా ఇతర దేశాల దౌత్యవేత్తలకు లభ్యంకాని ప్రత్యేక సౌకర్యాలు అమెరికా దౌత్యవేత్తలకు ఎందుకు కల్పించినట్టు? ఇన్నేళ్లుగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పనిమనుషులకు మన చట్టాలు తగిన స్థాయిలో వేతనాలు నిర్ణయించలేదన్నది నిజం. మన దౌత్యకార్యాలయాల్లో పనిమనుషులుగా వెళ్లిన వారికి కూడా ఆ చట్టాలకు అనుగుణంగానే వేతనాలు అందుతున్నాయి. ఇది సరిగా లేదనుకున్నప్పుడు అమెరికా అధికారులు మన దేశంతో సంప్రదింపులు జరపాలి. తమ దేశంలో దౌత్య కార్యాలయం కొనసాగించదలుచుకుంటే తాము నిర్ణయించిన వేతనాలివ్వాలని సూచించాలి. కానీ, అందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను శిక్షించబూనడం అనాగరికం. ఇప్పుడు మనవైపుగా తీసుకున్న చర్యల తర్వాతనైనా అమెరికాకు జ్ఞానోదయం కలగాలి. సరిగా వ్యవహరించడం నేర్చుకోవాలి.