లాయర్‌గా రాధికా ఆప్టే
‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే ఆ తర్వాత ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల ద్వారా తనలో మంచి మాస్ హీరోయిన్ ఉన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నారు. తాజాగా ‘టుడే’ చిత్రం ద్వారా మరోసారి తెలుగు తెరపై మెరవనున్నారు. ‘మనం’, ‘24’ చిత్రాల దర్శకుడు విక్రమ్‌కుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన రుద్రన్ దర్శకత్వం వహించారు.
5కలర్స్ మల్టీ మీడియా పతాకంపై దామెర శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మానసిక రోగులపై ఓ ముఠా చేస్తున్న అరాచకాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేశారు. జులైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.