Directed by Trishul
-
ఆ నటి ఏం చేసింది?
హిందీలో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తానీ భామ వీణా మాలిక్ ‘సిల్క్’ చిత్రం ద్వారా కన్నడ రంగానికి పరిచయమయ్యారు. త్రిశూల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘రెడ్ మిర్చి’ పేరుతో పీవీఎన్ సమర్పణలో నైస్ మూవీస్ సంస్థపై కనసుగారకరణ్ తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ - ‘‘సినిమా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ఓ నటి ఏం చేసింది? అనేది ఈ చిత్రకథ. వీణా మాలిక్ అద్భుతంగా నటించారు. అలాగే, ప్రతినాయిక పాత్రలో సన అభినయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కన్నడంలో నూటయాభై రోజులాడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్, మాటలు-పాటలు: భారతీబాబు, కెమెరా: జై ఆనంద్, దర్శకత్వం: త్రిశూల్. -
తాగుబోతు రమేశ్ హీరోగా...
తాగుబోతు పాత్రలకు చిరునామా అనిపించుకున్న తాగుబోతు రమేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తాగుబోతు ఆర్జీవీ’. రమేశ్ సరసన మేఘనా పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో త్రిశూల్ దర్శకత్వంలో ఎన్.ఎం. కాంతారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ - ‘‘తాగుబోతు పాత్రల ద్వారా పేరు తెచ్చుకున్న నేను ‘ఏకే రావు పీకే రావు’ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఇప్పుడు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కన్నడంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాననీ, తెలుగులో ఇది తొలి చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ నచ్చి, ఈ చిత్రం నిర్మిస్తున్నానని ఎన్.ఎం. కాంతారావు తెలిపారు. అలీ, పృధ్వీ, పోసాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఓంకార్ త్యాగరాజ్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: సినీటెక్ సూరి, ఎడిటింగ్: నాగేంద్ర.