ఆ నటి ఏం చేసింది? | Veena Malik's 'Red Mirchi' in March | Sakshi
Sakshi News home page

ఆ నటి ఏం చేసింది?

Published Mon, Feb 23 2015 12:07 AM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

ఆ నటి ఏం చేసింది? - Sakshi

ఆ నటి ఏం చేసింది?

హిందీలో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తానీ భామ వీణా మాలిక్ ‘సిల్క్’ చిత్రం ద్వారా కన్నడ రంగానికి పరిచయమయ్యారు. త్రిశూల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘రెడ్ మిర్చి’ పేరుతో  పీవీఎన్ సమర్పణలో నైస్ మూవీస్ సంస్థపై కనసుగారకరణ్ తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ - ‘‘సినిమా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ఓ నటి ఏం చేసింది?

అనేది ఈ చిత్రకథ. వీణా మాలిక్ అద్భుతంగా నటించారు. అలాగే, ప్రతినాయిక పాత్రలో సన అభినయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కన్నడంలో నూటయాభై రోజులాడిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్, మాటలు-పాటలు: భారతీబాబు, కెమెరా: జై ఆనంద్, దర్శకత్వం: త్రిశూల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement