director Bharathiraja
-
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాకు ఏమైంది? మరో హాస్పిటల్‌కు తరలింపు
తమిళసినిమా: సీనియర్ దర్శకుడు భారతీరాజా అనారోగ్యానికి గురై ఇటీవల ఒక చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉంది. గుండెల్లో నెమ్ము చేరడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని, రెండు రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో భారతీరాజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు. అలాంటిది సడన్‌గా శుక్రవారం ఆయనకు మెరుగైన వైద్యం కోసం స్థానిక పోరూరులోని శ్రీరామచంద్రన్ ఆసుపత్రిలో చేర్చారు. భారతీరాజా కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన గీత రచయిత వైరముత్తు అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతీరాజా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా శనివారం మధ్యాహ్నం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేరారు. అందులో ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన తనకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్యాన్ని అందిస్తూ చాలా శ్రద్ధగా వైద్య సేవలను అందించడంతో తాను కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రిలోని విజిటర్స్ ప్రవేశానికి అనుమతి లేనందున తనను చూడడానికి ఎవరూ రావద్దని కోరుకుంటున్నానన్నారు. తాను ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రత్యక్షంగానూ, ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా పరామర్శించినా, తాను త్వరలో కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారన్నారు. అయితే భారతీరాజా అనారోగ్యానికి కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు వైద్యులు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని వెల్లడించలేదు. దీంతో దర్శకుడు భారతీరాజాకు ఏమైంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
నిర్మాతకు రజనీకాంత్ బహుమతి!
చెన్నై: తనను హీరోను చేసిన నిర్మాతకు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ స్థిర నివాసం కల్పించారా? ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి భైరవా అనే చిత్రాన్ని నిర్మించారు ప్రఖ్యాత కథా రచయిత కలైజ్ఞానం. ఆ చిత్రం రజనీకాంత్ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో కలైజ్ఞానంకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నటుడు శివకుమార్ తెలిపారు. అంతే కాదు కలైజ్ఞానంకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. అదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వనని, తానే కలైజ్ఞానంకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. అంతే కాదు 10 రోజుల్లో అందుకు డబ్బును తాను అందిస్తానని చెప్పారు. దీంతో దర్శకుడు భారతీరాజా కలైజ్ఞానం కోసం కోటి రూపాయల్లో ఒక ఇంటిని చూసినట్లు, దాన్ని రజనీకాంత్ కొనుగోలు చేసి నిర్మాత కలైజ్ఞానంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై విచారించగా రజనీకాంత్ ఇంకా ఇల్లును కొనలేదని, దర్శకుడు భారతీరాజా ఇల్లు కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. అదే విధంగా కలైజ్ఞానంకు ఇంటిని కొనడానికి రజనీకాంత్ రూ.కోటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. రజనీతో ఎలాంటి బంధంలేదు.. దీనిపై నిర్మాత కలైజ్ఞానం స్పందిస్తూ తనకు నటుడు రజనీకాంత్‌తో ఎలాంటి అనుబంధం, రక్త సంబంధంగానీ లేదన్నారు. ఆయన్ని హీరోగా పరిచయం చేసి చిత్రం నిర్మించానంతేనని పేర్కొన్నారు. అలాంటిది తనకు రజనీకాంత్ ఎంత పెద్ద సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన మానవత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. కాగా రజనీకాంత్ ఇంతకు ముందు నటించిన అరుణాచలం చిత్రానికి తనతో చిత్రాలు చేసి ఆ తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఏడుగురిని భాగస్వాములుగా చేశారు. ఆ చిత్రానికి వచ్చిన లాభాలను వారికి పంచారు. అందులో నిర్మాత కలైజ్ఞానం ఉన్నారన్నది గమనార్హం. -
ఆ ఇద్దరి మధ్య వివాదం
కోలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతోంది. అయితే తాజాగా దానికి భంగం కలుగుతోందనిపిస్తోంది. కారణం ఒక నవల కావడం గమనార్హం. కుట్రపరంపరై అనే నవలను తెరకెక్కించే విషయంలో ఇద్దరు ప్రముఖుల మధ్య వివాదం ఏర్పడింది. ఆ నవలను తెరకెక్కించే హక్కులు తనవంటే తనవని ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా, సంచన దర్శకుడు బాలా పోటీ పడుతుండడం వివాదానికి దారి తీసింది. వాస్తవానికి కుట్రపరంపరై నవలను చిత్రంగా తెరపై ఆవిష్కరించాలన్న ప్రయత్నాన్ని దర్శకుడు భారతీరాజా చాలా కాలం ముందే చేశారు. కొన్ని అనివార్యకారణాల వల్ల అది జరగలేదు. తాజాగా దాన్ని దర్శకుడు బాలా హ్యాండిల్ చేయాలని సంకల్పించారు. ఇదే వారిద్దరి మధ్య వివాదానికి, కోలీవుడ్‌లో కలకలానికి తెర లేపింది. కాస్త విపులంగా చెప్పాలంటే బ్రిటీష్ పాలనకు ముందు ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు దొంగతనాన్నే వృత్తిగా జీవించడంతో వారిని కుట్రపరంపరై(పారంపర్య నేరస్తులు)ఆ తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ముద్రవేసింది.ఈ ఇతి వృత్తంతో వేలా రామమూర్తి రాసిన నవలను దర్శకుడు భారతీరాజా చిత్రంగా మలచనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. దాన్ని దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్, శరత్‌కుమార్‌లతో తెరకెక్కించడానికి ప్రయత్నించారట. ఆ సమయంలో శివాజీగణేశన్ అనారోగ్యానికి గురవడంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదని రచయిత రత్నకుమార్ అంటున్నారు. తారైతప్పట్టై చిత్రం పూర్తి చేసిన దర్శకుడు బాలా తదుపరి కుట్రపరంపరై నవలను చిత్రంగా రూపొందించనున్నట్లు, ఇందులో విశాల్, ఆర్య, రానా, అరవిందసామి,అనుష్క నటించనున్నట్లు వెల్లడించారు.దీంతో భారతీరాజా, బాలాల మధ్య వివాదానికి తెరలేచింది.రచయిత వేలా రామమూర్తి దర్శకుడు బాలానే కుట్రపరంపరై నవలకు తెరపై ప్రాణం పోయగలరనీ,త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుందని అంటున్నారు. అయితే భారతీరాజాతో కథా చర్చల్లో పాల్గొన్న రచయిత రత్నకుమార్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కుసీమయిలే,కరుత్తమ్మ,కాదల్పూక్కల్ చిత్రాలకు మాటలు రాసిన ఈయన తెలుపుతూ కుట్రపరంపరై నవలకు భారతీరాజా తెర రూపం ఇవ్వడానికి గత 30 ఏళ్లుగా చర్చలు జరుపుతున్నామని అన్నారు. 1977లోనే ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేశామని తెలిపారు.అప్పట్లోనే శివాజీగణేశన్,శరత్‌కుమార్‌లను నటింపచేయడానికి చర్చలు జరిపినట్లు వెల్లడించారు.అయితే శివాజీగణేశన్ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ ప్రారంభం కాలేదన్నారు. కాగా కుట్ర పరంపరై కథా చర్చల్లో రచయిత వేలా రామమూర్తి కూడా పాల్గోన్నారని చెప్పారు.దర్శకుడు భారతీరాజానే ఈ నవలను సమర్ధవంతంగా తెరకెక్కించగలరనే అభిప్రాయాన్ని రత్నకుమార్ వ్యక్తం చేశారు.కాగా ఈ వివాదాన్ని పరిష్కరించే విధంగా దర్శకుడు బాలాతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు.కుట్రపరంపరై చిత్రాన్ని బాలా కనుక దర్శకత్వం వహించదలిస్తే తాము చట్ట ప్రకారం కేసు వేస్తామని రత్నకుమార్ అంటున్నారు.దీంతో కుట్రపరంపరై విషయంలో దర్శకులు భారతీరాజా,బాలాల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. -
జూలై 17 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: జరీనా వాహబ్ (నటి); భారతీరాజా (దర్శకుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధునికి సంకేతం. పుట్టిన తేదీ 17 అంటే 8. శని దీనికి అధిపతి. బుధ శనులకు మిత్రత్వం ఉన్నందువల ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. వివాహం కాని వారికి వివాహమవుతుంది. కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు నేర్చుకుని వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. కొత్త ఆస్తులు కొనడం గాని, ఉన్న ఆస్తులు అభివృద్ధి చేయడం గానీ చేస్తారు. పోటీపరీక్షలు రాసేవారికి, క్రీడాకారులకు విజయం లభిస్తుంది. అలాగే కోర్టు కేసులలో కూడా విజయం లభిస్తుంది. ఆత్మస్తుతి తగ్గిస్తే బాగుంటుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి మరింత అభివృద్ధికరంగా ఉంటుంది. పని వారిపట్ల, వారి సంక్షేమం పట్ల బాధ్యతగా ఉండటం మంచిది. లక్కీ నంబర్స్: 3,4,5,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, బ్లూ, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: గురు; శుక్ర, శనివారాలు సూచనలు: అనాథలను ఆదుకోవడం, తల్లిని, తత్సమానులను ఆదరించడం, కుక్కలకు చపాతీలు పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఆస్తి తగాదాపై కార్తీక్ ఫిర్యాదు
టీనగర్: ఆస్తి తగాదాకు సంబంధించి నటుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెరైక్టర్ భారతీరాజా ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైన నటుడు కార్తీక్ అనేక చిత్రాల్లో నటించారు. ఈయన కుమారుడు గౌతం కార్తీక్ కూడా ప్రస్తుతం చిత్ర నటుడిగా కొనసాగుతున్నారు. కార్తీక్‌కు అతని కుటుంబీకులకు మధ్య ఆళ్వారుపేటలోగల ఇల్లు, ఇతర స్థలాలకు సంబంధించి కొంతకాలంగా తగాదాలు వున్నాయి. ఈ కారణంగా కొన్ని రోజుల క్రితం కార్తీక్ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన విడిగా వుంటున్నట్లు సమాచారం. ఈ క్రమం లో కార్తీక్ మంగళవారం రాత్రి తేనాంపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒక ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఇందులో ఆస్తి తగాదా గురించిన వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఆస్తి తగాదాకు సంబంధించి కార్తీక్ అందజేసిన ఫిర్యాదుపై విచారణ జరుపనున్నట్లు తెలిపారు.