director ravikumar
-
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే’ వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికుమార్ చావలి. మైండ్ గేమ్ కాన్సెప్ట్‌తో తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీలతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లండ్) ప్రధాన పాత్రల్లో నటించారు. యారో సినిమాస్ సమర్పణలో యు అండ్ ఐ ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బలరామ్ మక్కల ఈ సినిమా నిర్మించారు.రవికుమార్ చావలి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన చిత్రమిది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు వాళ్లతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోని పాత్రలు కూడా మెప్పిస్తాయి. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం కనువిందుగా ఉంటుంది. కార్తీక్ కొడకండ్ల సంగీతం అలరిస్తుంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. -
దర్శకుడిపై నటి సుజిబాల ఫిర్యాదు
చెన్నై : దర్శకుడు రవికుమార్, తమిళ నటి సుజిబాల మధ్య ఏర్పడిన వివాదం పోలీసుల వరకూ వెళ్లింది. దర్శకుడు రవికుమార్ సుజిబాల తన భార్య అని, తమను విడదీయడానికి కుట్ర జరుగుతోందంటూ పత్రికలకెక్కారు. ఈ వ్యవహారంపై నటి సుజిబాల గురువారం రవికుమార్‌పై స్థానిక వడపళని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ దర్శకుడు రవికుమార్‌కు తనకు వివాహ నిశ్చితార్థం మాత్రమే జరిగిందని తెలిపారు. రవికుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మామిడితోట తనకు కొనిచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. ఇటీవల నటనా పాఠవాలలో ఉన్న తనపై చేయి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. రవికుమార్‌కు ఇంతకు ముందే పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసే ఆయనతో వివాహం రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. తాను మళ్లీ చిత్రాల్లో నటించడం రవికుమార్‌కు నచ్చడం లేదన్నారు. అందుకే తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రవికుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. నటి సుజిబాల ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో దర్శకుడు రవికుమార్‌ను విచారించనున్నారు.