దర్శకుడిపై నటి సుజిబాల ఫిర్యాదు | actress Sujibala files death threat complaint against director ravi kumar | Sakshi
Sakshi News home page

దర్శకుడిపై నటి సుజిబాల ఫిర్యాదు

Published Sat, Apr 5 2014 9:27 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

దర్శకుడిపై నటి సుజిబాల ఫిర్యాదు - Sakshi

దర్శకుడిపై నటి సుజిబాల ఫిర్యాదు

చెన్నై : దర్శకుడు రవికుమార్, తమిళ నటి సుజిబాల మధ్య ఏర్పడిన వివాదం పోలీసుల వరకూ వెళ్లింది. దర్శకుడు రవికుమార్ సుజిబాల తన భార్య అని, తమను విడదీయడానికి కుట్ర జరుగుతోందంటూ పత్రికలకెక్కారు. ఈ వ్యవహారంపై నటి సుజిబాల గురువారం రవికుమార్పై స్థానిక వడపళని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అందులో ఆమె పేర్కొంటూ దర్శకుడు రవికుమార్కు తనకు వివాహ నిశ్చితార్థం మాత్రమే జరిగిందని తెలిపారు. రవికుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మామిడితోట తనకు కొనిచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. ఇటీవల నటనా పాఠవాలలో ఉన్న తనపై చేయి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. రవికుమార్కు ఇంతకు ముందే పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసే ఆయనతో వివాహం రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.

తాను మళ్లీ చిత్రాల్లో నటించడం రవికుమార్కు నచ్చడం లేదన్నారు. అందుకే తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రవికుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. నటి సుజిబాల ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో దర్శకుడు రవికుమార్ను విచారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement