ఆట ఆడింది ఎవరు?
ధీరేంద్ర, పూజిత జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్కుమార్ నిర్మిస్తోన్న ‘డర్టీగేమ్’ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -‘‘సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో రాజకీయ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
డర్టీగేమ్ ఏంటి? అసలు ఈ గేమ్ ఆడింది ఎవరు? రిజల్ట్ ఏంటి? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఈ మిస్టరీ ప్రశ్నలన్నిటికీ చిత్రంలో సమాధానాలు దొరుకుతాయి. సురేశ్, నిర్మాత తాడి మనోహర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు- కథనం- దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ, సంగీతం: సునీల్ కశ్యప్.