Disagree
-
పెళ్లికి ఒప్పుకోలేదని..
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు యువ తి కుంటుంబ సభ్యులపై దారుణానికి ఒడిగట్టాడు. యువతి, తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çసంఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, తిరువణ్ణామలై : పెళ్లికి అంగీకరించలేదని యువతి, తల్లిదండ్రులపై దాడిచేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో యువతి, తల్లి మృతిచెందగా, యువతి తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కణ్ణమంగళం సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని కనికాపురానికి చెందిన శివరామన్(54) వ్యవసాయ కూలీ. ఇతని భార్య చామండీశ్వరి(44), వీరి కుమార్తె నిర్మల(24) ఎంఏ, బీఎడ్ పట్టభద్రురాలు. ఇదే గ్రామానికి చెందిన రాజవేలు కుమారుడు అన్బయగన్(34) వీరికి బంధువు అవుతాడు. ఇతను నిర్మలను వివాహం చేసుకోవాలని ఆశతో ఉన్నాడు. నిర్మల చదువుకు అయ్యే ఖర్చులు పూర్తిగా అన్బయగన్ పెట్టినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం శివరామన్ ఇంటికి వెళ్లి నిర్మలను వివాహం చేసుకుంటానని అన్బయగన్ కోరాడు. ఇందుకు చామండీశ్వరి నిరాకరించడం, నిర్మల కూడా వివాహం చేసుకోనని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన అన్బయగన్ ఇంట్లో ఉన్న కత్తితో చామండీశ్వరి, శివరామన్, నిర్మలను పొడిచాడు. నిర్మల, చామండీశ్వరి అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలతో శివరామన్ కేకలు వేశాడు. దీంతో అన్బయగన్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ కేకలు విన్న స్థానికులు ఇంటికి వచ్చి శివరామన్‌ను ఆస్పత్రికి తరలించారు. శివరామన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనంతరం అన్బయగన్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని, డీఎస్పీ సెంథిల్, కణ్ణమంగళం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సద్దుమణగని ‘సుప్రీం’ సంక్షోభం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అసమ్మతి గళం వినిపించిన నలుగురు సీనియరు న్యాయమూర్తులు గురువారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక కేసుల కేటాయింపులతో పాటు ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. గత నాలుగు రోజుల్లో సీజేఐ, నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సమావేశం కావడం ఇది రెండోసారి. జనవరి 12 నాటి మీడియా సమావేశంలో సీజేఐ తీరుపై నలుగురు న్యాయమూర్తులు ఫిర్యాదు చేశాక.. తొలిసారి మంగళవారం వారు భేటీ అయిన సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్ మిశ్రాతో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జోసఫ్‌లు దాదాపు 15 నిమిషాలు చర్చించినట్లు తెలుస్తోంది. నలుగురు జడ్జీలు లేవనెత్తిన డిమాండ్లు తనకు తెలుసని ఈ భేటీలో సీజేఐ చెప్పారని సుప్రీం వర్గాల సమాచారం. వారు లేవనెత్తిన అంశాలు, సలహాల్ని పరిగణనలోకి తీసుకుంటానని సీజేఐ హామీ ఇచ్చిన నేపథ్యంలో వివాద పరిష్కారంలో కొంత పురోగతి కనిపించిందని సుప్రీం వర్గాలు తెలిపాయి. తదుపరి చర్చల్లో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు కూడా పాల్గొని సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నించనున్నట్లు సమాచారం. మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం జస్టిస్ జే చలమేశ్వర్ చెన్నై బయల్దేరి వెళ్లారు. మీడియాను అడ్డుకోవాలన్న పిటిషన్ తిరస్కరణ జనవరి 12 నాటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నలుగురు సీనియర్ న్యాయమూర్తుల లేవనెత్తి అంశాల్ని మీడియాలో ప్రచురించకుండా, చర్చించకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. సుప్రీం రిజిస్ట్రార్ పిటిషన్‌ను పరిశీలించి.. విచారణ సమయం కేటాయించిన అనంతరం ఆ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. -
ఉత్తర్వులే
► జూనియర్ కళాశాలల్లో కానరాని బయోమెట్రిక్ విధానం ► బోగస్ హాజరుతో స్కాలర్షిప్లు మెక్కుతున్న యాజమాన్యాలు! ► పట్టించుకోని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నెల్లూరు (టౌన్) : ఇంటర్మీడియెట్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు నమోదుకు విధిగా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభం నుంచి బయోమెట్రిక్ విధానంలోనే విద్యార్థుల హాజరు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, జిల్లాలో ఒక్క కళాశాలలోనూ బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ విధానం అమలుకు నిరాకరించే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరి కను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్మీ డియెట్ బోర్డు అ«ధికారులు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. ఉపకార వేతనాలను మేసేందుకేనా! జిల్లాలో 121 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 60 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతినెలా రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 స్కాలర్షిప్ మంజూరవుతోంది. ఈ సొమ్ము కోసం చాలా కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్ చేయించే బాధ్యత తమదేనని భరోసా ఇస్తూ పలు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తరగతుల్లో చేర్చుకుంటున్నాయి. విద్యార్థులు రోజూ కళాశాలకు రాకపోయిన రికార్డులో హాజరు చూపిస్తూ స్కాలర్ షిప్పు మొత్తాలను కాజేస్తున్నాయి. మరోవైపు ఇతర విద్యార్థులు తరగతులకు రాకపోయినా హాజరు నమోదు చేసి వారినుంచి వేలకు వేలు దండుకుంటున్నారు. కొన్ని సంద ర్భాల్లో హాజరు తక్కువగా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్‌ను బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం స్కాలర్షిప్ సొమ్ము విడుదల చేస్తుంది. ఈ దృష్ట్యా ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున కళా శాలల్లో ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశించింది. ఇవి ఏర్పాటు కాకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) బాధ్యులవుతా రని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో జూనియర్ కళాశాలలు 162 కార్పొరేట్ కాలేజీలు 121 ప్రభుత్వ కళాశాలలు 26 ఎయిడెడ్ పరిధిలో 15 ఇంటర్మీడియెట్ విద్యార్థులు 60 వేలు సెప్టెంబర్ వరకు గడువిచ్చాం జిల్లాలోని కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చాం. అప్పటికి ప్రతి జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. లేకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాదు. బయోమెట్రిక్ ద్వారా వచ్చే హాజరునే పరిగణనలోకి తీసుకుంటాం. – బాబూజాకబ్, ఆర్ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు. -
చెత్త రికార్డుపై స్పందించిన ఎయిరిండియా
విమానయాన సంస్థల పనితీరుపై డేటా సర్వీసు కంపెనీ ఫ్లైట్ స్టాట్స్ వెల్లడించిన రిపోర్టుపై ఎయిరిండియా స్పందించింది. ఫ్లైట్ స్టాట్స్ రిపోర్టుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఫ్లైట్ స్టాట్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత చెత్త విమానయాన సంస్థలో ఎయిరిండియా మూడో స్థానంలో ఉంది. సరియైన సమయంలో ప్రయాణికులకు గమ్యం చేర్చలేకపోవడంతో ఎయిరిండియా అధ్వాన పనితీరు జాబితాలో 3వ స్థానానికి వచ్చినట్టు ఫ్లైట్ స్టాట్స్ తెలిపింది. ఎయిరిండియాపై ఫ్లైట్ స్టాట్స్ పబ్లిష్ చేసిన రిపోర్టుతో తాము పూర్తిగా విభేదిస్తున్నామని, తాము చెత్త కాదని సంస్థ అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమికంగా ఈ రిపోర్టు కల్పితమని తాము గుర్తించినట్టు, దీనిపై ఎయిరిండియా మేనేజ్మెంట్ విచారణ చేపడుతుందని తెలిపింది. గ్లోబల్‌గా విమానయాన సంస్థలు ఎలాంటి పనితీరు కనబరుస్తున్నాయో పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే ఈ రిపోర్టును ప్రకటించినట్టు ఫ్లైట్ స్టాట్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. గత ఎనిమిదేళ్లలో ఆన్-టైమ్ ఫర్ఫార్మెన్స్ సర్వీసెస్(ఓపీఎస్) అందిస్తున్న సంస్థగా తామెంతో పేరుగాంచామని, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్‌గా అవార్డ్స్ పొందుతున్నట్టు ఎయిరిండియా చెపుకొస్తోంది.