DISCOMs erc
-
45 రోజుల్లో రూ.1,550 కోట్లు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) షాక్ ఇచి్చంది. సౌర విద్యుత్ విక్రేత కంపెనీలకు రూ. 1,550 కోట్లకుపైగా బకాయిలను 45 రోజుల్లో చెల్లించాలని దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/టీఎస్‌ఎనీ్పడీసీఎల్)లను వేర్వేరు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇప్పటివరకు బకాయిపడిన మొత్తం బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కంపెనీలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం ఇకపై ఎప్పటికప్పుడు వాటికి చెల్లింపులు జరపాలని ఆదేశించింది. నెలలు, ఏళ్లు గడుస్తున్నా డిస్కంలు బిల్లులు చెల్లించకపోవడంతో పలు కంపెనీలు ఈఆర్సీని ఆశ్రయించి తమ వాదనలు వినిపించాయి. ఈ వాదనలతో ఏకీభవించిన ఈఆర్సీ.. ఆయా కంపెనీలకు 45 రోజుల్లోగా మొత్తం బకాయిలను అపరాధ రుసుం (లేట్ పేమెంట్ సర్‌చార్జీ)తో కలిపి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేవాంగరే షుగర్ కంపెనీ కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్రి్టసిటీ (ఏపీటెల్) 2009లో జారీ చేసిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని ఈఆర్సీ ఆ నిర్ణయం తీసుకుంది. సకాలంలో బకాయిలను చెల్లించకపోవడం పీపీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలను చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం చాలా అరుదని డిస్కంల అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొండలా పెరిగిపోయిన బకాయిలు... రాష్ట్ర డిస్కంలు దాదాపుగా 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సౌర విద్యుత్ కేంద్రాల డెవలపర్లతో గత ఐదారేళ్ల కింద ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా చెల్లించాలి. కానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలు సౌర విద్యుత్ కంపెనీలకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతున్నాయి. రెండు, మూడేళ్ల నాటి బిల్లులను సైతం కొన్ని కంపెనీలకు బకాయిపడటంతో వాటిపై అపరాద రుసుం భారీగా పెరిగిపోతోంది. అసలు బిల్లులు, అపరాద రుసుములు కలిపి మొత్తం చెల్లించాల్సిన బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోవడంతో డిస్కంలు సతమతమవుతున్నాయి. బకాయిల కోసం పలు సౌర విద్యుత్ కంపెనీలు కేంద్ర విద్యుత్ శాఖకు ఫిర్యాదు సైతం చేశాయి. ఈ నేపథ్యంలోనే పవర్ ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రం విద్యుత్ కొనుగోళ్లు జరపకుండా కేంద్రం ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంపై నిషేధం విధించింది. తాజాగా ఈఆర్సీ సైతం 45 రోజుల్లోగా మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని ఆదేశించడం గమనార్హం. చదవండి: వీఆర్ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు? -
కరెంట్ షాక్...
గుంటూరు, సాక్షి: అపాయింటెడ్ డే జూన్ 2 తర్వాత కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వినియోగదారుల నడ్డి విరిచే విధంగా జేబుకు చిల్లు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచేందుకు డిస్కం ఈఆర్సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేదు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబు దాటితే ముక్కు పిండి రూ.300కు పైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో కరెంటు వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది. చార్జీల పెంపు, కొత్త టారిఫ్‌లపై విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు గాను ఇకపై రూ.611.50 చెల్లించాలి. పొరపాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్టు పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు రానుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్టు ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున ఉంటాయి. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్టు పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించి ఆమోదం కూడా పొందడంతో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లు మోత మోగనుంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించనున్నారు. ఈ బాదుడు అమలైతే జిల్లాలో వినియోగదారులపై ఏడాదికి రూ.360 కోట్ల భారం పడనుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్తు బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ డిస్కంకు సెంట్రల్ డిస్కం నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.