‘మీరంతా గర్వపడేలా.. ‘ఖైదీ నంబర్ 150’’
‘2017 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్’ (మా) డైరీ ఆవిష్కరణ గురువారం హీరో చిరంజీవి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ‘‘మీరంతా గర్వపడేలా.. ‘ఇదిరా చిరంజీవి అనేలా ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఉంటుంది. ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాను’’ అని ‘మా’ బృందాన్ని, అభిమానులను ఉద్దేశించి చిరంజీవి అన్నారు.
‘మా’ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి హీరోగా రీ–ఎంట్రీ ఇస్తున్నందుకు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ బృందం శుభాకాంక్షలు తెలిపారు.