నేడు సాక్షి ఆధ్వర్యంలో చర్చా వేదిక
అనంతపురం అర్బన్ :
‘అనంతపురం కరువు, సాగునీటి ప్రాజెక్టులు – మన బాధ్యత’ అనే అంశంపై సాక్షి ఆధ్వర్యంలో గురువారం చర్చావేదిక జరగనుంది. ఉదయం 10 గంటలకు స్థానిక లలితకళాపరిషత్లో నిర్వహిస్తున్న ఈ చర్చావేదికలో సీపీఎం, సీపీఐ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఐద్వా, మహిళా సమాఖ్య, సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు సంఘాలు, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.
సాగునీటి రంగ నిపుణులు, రచయితలు, మేధావులు, సీనియర్ పాత్రికేయులు కూడా హాజరుకానున్నారు. జిల్లాలో వర్షాభావంతో ఎండిన పంటలు, ప్రభుత్వ బాధ్యత, హంద్రీ–నీవా, హెచ్ఎల్సీ ద్వారా జిల్లా కోటా కింద రావాల్సిన నీటిని ఎలా సాధించుకోవాలనే అంశాలపై చర్చించడంతో పాటు సూచనలను చేస్తారు.