మురికి బీచ్లో అమ్మాయిల వింత సరదా
అలుపెరుగని అలల నురగలతో సుందరంగా ఉండాల్సిన బీచ్ ఆకుపచ్చగా మారిపోయింది. తూర్పు చైనా జింగ్ డావో ఫ్రావిన్స్ లోని ఓ బీచ్ నాచుమయంగా మారింది. అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చే నాచుతో ఆ ప్రాంతమంతా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. సాధారణ నాచులా కంపు కొట్టకుండా సువాసన వెదజల్లే ఈ నాచు తీరాన్ని చూసేందుకు చైనీయులు ఎగబడుతుంటారు. మరీ ముఖ్యంగా వీకెండ్స్ లో అమ్మాయిల తాకిడి ఎక్కువగా ఉంటోంది.
పచ్చ సముద్రం (యెల్లో సీ) నుంచి భారీగా కొట్టుకొచ్చే నాచును.. దాదాపు 9 వేల హెక్టార్లు పేరుకుపోయిందని, దీనిని శుభ్రం చేయాలనుకునే లోగా పర్యాటకుల సంఖ్య పెరిగిందని, దీంతో నాచు తొలగింపు పనులు నిలిపేశామని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆకుపచ్చ నాచులో అందంగా ఆడుకుంటోన్న అమ్మాయిల ఫొటోలు ఇవిగో..