కోరుట్ల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి
ర్యాలీలు, రాస్తారోకోలు
పట్టణంలో 144 సెక్షన్
కోరుట్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని చేపట్టిన పోరు ఊపందుకుంది. రెండు రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ 144 సెక్షన్ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుకోవాలని సూచించారు. కోరుట్ల మినీవ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదాం రోడ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీసి రాస్తారోకో చేశారు. ముస్లిం మైనార్టీలు తెలంగాణతల్లి విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ మధుకు వినతిపత్రం ఇచ్చారు. దీక్షలో చెట్పల్లి లక్ష్మణ్, వడ్లకొండ తుక్కారాం, బాపురావు పాల్గొన్నారు. డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి పేట భాస్కర్, ప్రతినిధులు గడ్డం మధు, జక్కుల ప్రసాద్ మాట్లాడుతూ కోరుట్ల డివిజన్ సాధించే వరకు ఉద్యమిస్తామన్నారు.