disseases
-
పెళ్లే అవ్వదనుకున్నారు..అలాంటిది ప్రెగ్నెంట్ అయ్యింది..ఏకంగా 36 సార్లు..!
కొన్ని రకాల వ్యాధులు ఎలా ఉంటాయంటే..జీవితాంతం వాటితోనే బతకాల్సిందే. వాటికి నివారణ ఉండదు. అలాంటి వ్యాధి ఉన్నవాళ్లు ఎంతలా ఆత్మనూన్యత భావంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. నాకే ఎందుకు ఇలాంటి సమస్య అని దిగులు చెందడం సహజం. కానీ ఈ అమ్మాయి. ఆ వ్యాధికే సవాలు విసిరేలా బతికి చూపిస్తోంది. ఇంతకీ మహిళ. ఎవరంటే..అహ్మదాబాద్‌కు చెందిన కింజల్ లాథి చిన్ననాటి నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి బారిన పడినవాళ్లు ప్రతి 15 రోజులకొకసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల జీవితకాలం చాలా తక్కువ. ఎందుకంటే. జీవించినంత కాలం కనీస 50 వేలకు పైగా రక్తం ఎక్కించుకుంటారు. దీని కారణంగా శరీంలో ఐరన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి ఇతర అవయవాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వ్యాధితో బాధపడే యువతకు పెళ్లి అవ్వడం అనేది కష్టమే. కుటుంబసభ్యులకు కూడా ఈ విషయం తెలిసి జీవించినంత కాలం వారు ఆనందంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ కింజల్ తల్లిదండ్రలు కూడా అలానే ఆమెను అపురూపంగా చూసుకునేవారు. పెళ్లి అవ్వదనే బెంగతోనే ఉండేవారు. కింజల్ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉండి, సహృదయంతో అర్థం చేసుకుని ముందుకు వస్తే.. పెళ్లి చేయగలమని తల్లిదండ్రులకు తెలుసు. అందుకే పెళ్లి అనేది తమ కూతురుకి కలగా మిగిలిపోతుందేమో అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి అవ్వడమే గగనం అనుకుంటే.. అయితే కింజల్కి కామన్ ఫ్రెండ్ ద్వారా తన పక్కింటిలో ఉండే నవీన్ లాథితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. నవీన్ కింజల్‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కింజల్తోనే నేరుగా చెప్పాడు నవీన్. అయితే తన ఆరోగ్య సమస్య గురించి నవీన్‌తో క్లియర్‌గా చెప్పి.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సూచించింది. అయితే నవీన్ తననే పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. అయితే నవీన్ నిర్ణయానికి ఆశ్చర్యపోవడం తోపాటు ఆమె హెల్త్ రిపోర్ట్‌లను నవీన్ చేతిలో పెట్టి..మంచి వైద్యుడిని సంప్రదించి తగు నిర్ణయం తీసుకోమని కోరారు. నవీన్ కూడా ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలసుకుని అర్థం చేసుకోవడమే గాక కింజల్‌ని పెళ్లి చేసువాలని ఫిక్స్ అయ్యాడు. నవీన్ తన తల్లిదండ్రులు వద్దన్నా.. కింజల్‌ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో పెళ్లి అవ్వదనుకున్న తన కూతురికి వివాహం కావడంతో కింజల్ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. అక్కడితో కింజల్ ఆగలేదు. ఎలాగైనా తల్లిని కావాలనుకుంది. నిజానికి తలసేమియాతో బాధపడే వాళ్లు బిడ్డును కనేందుకు ప్లాన్ చేయడం కుదరదు. అందుకు వైద్యులు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడే వాళ్లలో ఐరన్ లోపం తోపాటు ప్రతి 15 రోజులకు ఎక్కించే రక్తం కారణంగా.. బిడ్డకు సక్రమంగా ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. పైగా ప్రసవం సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి కూడా. కింజల్దే తొలి కేసు..అదీగాక ఇంతవరకు తలసేమియాతో బాధపడుతున్న ఏ మహిళా పిల్లలను కన్న కేసు ఒక్కటి కూడా లేదు. అలాంటిది కింజల్ పట్టుపట్టి..భర్తను ఒప్పించి మరీ బిడ్డను కనేందుకు సిద్ధమైంది. డాక్టర్లు కూడా ఆమె కోరికను కాదనలేక ఓ ఛాన్స్ తీసుకుంటే ఏమవుతుందని ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు డాక్టర్ అనిల్ ఖత్రి వైద్య బృందం. వాళ్లకు కూడా కింజల్దే తొలి కేసు. వాళ్లు అత్యంత జాగ్రత్తగా కింజల్‌ని పర్యవేక్షించారు. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినా మూడు నెలల వరకు ఇంట్లో చెప్పొద్దన్నారు వైద్యులు. ఆ తర్వాత ఆమె కండిషన్ బాగానే ఉందని తెలిసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అలా ఆమె గర్భధరాణ సమయంలో ఏకంగా 36 సార్లు రక్త మార్పిడి చేయించుకుంది. అన్ని సార్లు చేయించుకుంటే..లోపల బిడ్డ బతకిబట్టకట్టడం కష్టం అనేది వైద్యుల ఆందోళన. కానీ కింజల్ ఆ అనారోగ్య సమస్యను సవాలు చేసేలా అధిగమించి మరీ పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి తలసేమియా బారినపడలేదు. అలా 2019 జూలై 12న ఆరోగ్యకరమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది కింజల్. ఓ పక్క రక్తం ఎక్కించుకుంటూనే బిడ్డకు పాలిచ్చింది కూడా. ఇప్పుడు ఆ చిన్నారికి ఆరేళ్లు. చాలా ఆరోగ్యంగా ఉంది కూడా. ఇక్కడ అనారోగ్యం ఎంత పెద్దదైనా..మనలో ధైర్యం, బాగుండాలనే ఆశ బలంగా ఉంటే సమస్య కూడా ఉఫ్‌మని ఎగిరిపోతుందని నిరూపించింది కింజల్. ఎలాంటి స్థితిలోనైనా ధైర్యాన్ని వివడకండి ఆనందకరమమైన జీవితాన్ని వదులోకకండి అని చెబుతున్నట్లుగా ఉంది కదా కింజల్ కథ..!. (చదవండి: యూట్యూబర్ ప్రజక్తా కోలి మెడలో హైలెట్‌గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..) -
ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితి..!
According WHO healthcare situation: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల పైగా దాడి చేస్తూనే ఉంది. వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం కేవలం ఉక్రెయన్కి ప్రాణ, ఆస్తి నష్టం మాత్రమే కలగించలేదు, అంతకుమంచిన తీవ్ర దుష్పరిణామాను మిగిల్చింది. ఈ నిరవధిక దాడుల కారణంగా ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, ఆహారం లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురుయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైమానికి దాడుల కారణంగా కాలుష్యం ఎక్కువై నీరు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని చెబుతోంది. ప్రస్తుతం రష్యా బలగాలు మారయుపోల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేశారు. నిజానికి 2011లో మారియుపోల్ తొలి కలరా వ్యాధిని గుర్తించారు. మళ్లీ ఈ యుద్ధం కారణంగా ఆ వ్యాధి మరింత ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మార్చి 18 నాటికి లుహాన్స్క్ ప్రాంతంలో దాదాపు లక్ష మందికి నీటి సౌకర్యం లేదని తెలిపింది. అయితే ప్రభుత్వేతర నియంత్రిత ప్రాంతాలలో కూడా దాదాపు 4 లక్షల మందికి నీటి సరఫరా లేదని వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా చాలామంది వ్యక్తులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అందువల్ల డిజార్డర్ డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. గర్భనిరోధకం అందుబాటులో లేకపోవడం వల్ల లైంగిక పరంగా హింసకు గురయ్యే ప్రమాదం పోంచి ఉందని తెలిపింది. అదీగాక లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రమాదకరమైన సంక్రమిత అంటు వ్యాధులు కోవిడ్-19 కేసులు ఈ బాంబుల దాడుల కారణంగా ఒకే షెల్టర్‌లో కోవిడ్ -19 పేషంట్లకు వైద్యం అందించాల్సిన స్థితి ఏర్పడుతుంది. అది కాక ఈ బాంబు దాడుల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ఎక్కువయ్యే అవకాశం ఉంది. మార్చి 17 కల్లా ఉక్రెయిన్‌లో సుమారు 27,671 కోవిడ్ -19 కేసులు 384 మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. అయినా ఈ యుద్ధ తీవ్రత కారణంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం కూడా కష్టమేనని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. మీజిల్స్ కేసులు మార్చి 22న, రొమేనియాకు వచ్చి శిబిరాల్లో ఉంటున్న ఉక్రేనియన్ శరణార్థులలో మూడు అనుమానిత మీజిల్స్ కేసులు గుర్తించనట్లు నివేదిక తెలపింది. ప్రసవానంతర సంరక్షణ వచ్చే మూడు నెలల్లో ఉక్రెయిన్‌లో దాదాపు 80 వేల మంది మహిళలు జన్మనిస్తారని అంచనా. ప్రసూతి సంరక్షణకు అంతరాయం ఏర్పడి ప్రసూతి నియోనాటల్ సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అదీగాక ప్రసూతి ఆసుపత్రులతో సహా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడుల కారణంగా సిజేరియన్ వంటి విధానాలను నిర్వహించడం, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ అందించడం వంటి ప్రసూతి సమస్యలను నిర్వహించే సామర్థ్యం కూడా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడించింది. (చదవండి: ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్... అదే మా లక్ష్యం!) -
జబ్బుల పట్ల జాగ్రతలు పాటించాలి
మోతె : సీజనల్ జబ్బుల పట్ల ప్రజలు జాగ్రతలు పాటించాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగలక్ష్మి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో జరిగిన జాతీయ పైలేరియా వ్యాధి నివారణ కార్యక్రమంపై ఆరోగ్య సిబ్బందికి జరిగిన అవగాహణ సదస్సులో ఆమే మాట్లాడుతు గ్రామాలలో ప్రజలు ప్రమాదకరమైన జబ్బులపై జాగ్రతలు పాటించాలన్నారు. నేటి నుంచి∙సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు గ్రామాలలో ఫైలేరియా వ్యాధికి నివారణ ముందులను పంపిణీ చేయాలని ఆరోగ్య సిబ్బందికి ఆమే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, శ్రీనివాస్, రాములమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.