DIST PRESIDENT
-
మళ్లీ సీతమ్మకే పగ్గాలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రస్తుత అధ్యక్షురాలు తోట సీతారామలక్షి్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో వివిధస్థాయిల కమిటీలను ఎంపిక చేశామని, జిల్లా కమిటీ నాయకులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని 15 నియోజకవర్గాల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఈ మేరకు తోట సీతారామలక్షి్మని ఎన్నుకున్నామని, ఆమెతో పాటు జిల్లా కమిటీలోని ఇతర పదవులకు, అనుబంధ కమిటీలకు నాయకులను ఎన్నుకున్నామని చెప్పారు. జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శులుగా ఉప్పాల జగదీష్‌బాబు, చెలికాని సోంబాబు, పార్టీ జిల్లా కార్యాలయ కార్యనిర్వహక కార్యదర్శిగా పాలి ప్రసాద్, కోశాధికారిగా శ్రీకాకుళపు వెంకట నరసింహరావును ఎన్నుకున్నామన్నారు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా గంగిరెడ్ల మేఘాలాదేవి, ప్రధాన కార్యదర్శులుగా భైరెడ్డి ఆదిలక్ష్మి, బెజ్జం అచ్చాయమ్మ, తెలుగు రైతు అధ్యక్షులుగా పసల అచ్యుత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా దొంగ నాగరాజు, బీసీ అధ్యక్షులుగా కొనుకు జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మీరా, జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా మహబూబ్ ఆలీఖాన్ (జాని), ప్రధాన కార్యదర్శులుగా అల్తాఫ్, సుభానీని ఎన్నుకున్నామని చెప్పారు. ఎస్సీ అధ్యక్షులుగా దాసరి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పీతల శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షులుగా పేరాబతి్తన సాయిరమేష్, వాణిజ్య సెల్ అధ్యక్షులుగా పాట్రు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చుండూరి సత్యనారాయణ, టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఆసన సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా మారిశెట్టి వేణుగోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసనాయుడు, టీఎన్టీఎస్ఎఫ్ అధ్యక్షులుగా మద్దిపాటి ధర్మేంద్ర, చేనేత విభాగం అధ్యక్షులుగా అందే వీరభద్రం, క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు గేదెల జాన్, వైద్య విభాగం అధ్యక్షులుగా సుంకర సుధీర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.స్లీవ్రాజును ఎన్నుకున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు చిక్కాల సూర్యనారాయణ, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, వేటుకూరి శివరామరాజు పాల్గొన్నారు. -
ఆక్వా పార్క్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం
నరసాపురం : గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాలైన తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పర్యటిం చారు. ఆక్వాఫుడ్ పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పో రాడుతున్న గ్రామస్తులపై సోమవారం పోలీసులు దౌర్జన్య కాండ జరిపిన విషయం తెలిసిందే. బాధితులను మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, ఆచంట నియోజక వర్గ కన్వీనర్ కవురు శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు. ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వా మ్య విలువలకు పాతరేసి పచ్చని గ్రామాల్లో దమనకాండ సృష్టిస్తోందని విమర్శించారు. దీనిని వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు తుందుర్రులో పర్యటిస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే ఫ్యాక్టరీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. ఇక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆగే వరకూ వైఎ స్సార్ సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. పోలీసుల సాయంతో జరుగుతున్న దమనకాండకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు సముద్రంలో కలిసేలా పైప్లైన్లు వేసేస్తున్నామని మంత్రుల నుం చి కూడా ప్రకటనలు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రకటనలు చేస్తు న్న మంత్రులు ఇక్కడకు వచ్చి పైప్లైన్లు చూపించాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యాలు, అణచివేత ద్వారా ఏదో చేద్దామనుకుంటే అంతకు మించిన పొరపాటు ఉండదన్నారు. వెంటనే ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలించాల ని కోరారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ తుందు ర్రు చుట్టుపక్కల గ్రామాల మహిళలకు జరుగుతున్న అవమానాలు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందన్నారు. పాకిస్తాన్ సరిహద్దు వాతావరణాన్ని సృష్టిం చడం ఎంతవరకూ సమంజసమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. సీపీఎం నేతలు బి.బలరామ్, కవురు పెద్దిరాజు, వైఎస్సార్సీపీ నేతలు పాలంకి ప్రసాద్, సాయినాథ్‌ప్రసాద్, బర్రి శంకరం, మెగా ఆక్వాఫుడ్పార్కు పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. చీరలు లాగించే సంప్రదాయం ఆపండి ‘సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని పదేపదే చెబుతున్నారు, సింగపూర్ తరువాత చేద్దువుగాని ముందు పోలీసులతో మహిళల చీరలు లాగించే సంప్రదాయాన్ని కట్టిపెట్టం డి’ అని బాధిత గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మేమెప్పుడూ రోడ్డెక్కలేదు.. పోలీస్స్టేషన్లు చూడలేదు.. గుట్టుగా సంసారం చేసుకునే వాళ్లం.. మా మీద అంత కక్ష సాధింపు ఎందుకంటూ మహిళలు వైఎస్సార్ సీపీ నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి నుంచి సోదాలు అర్ధరాత్రి నుంచి పోలీసులు సోదాలు చేశారని, రోడ్డుమీదకు రాగానే లాక్కెళ్లి పోయారని తుందుర్రుకు చెందిన సముద్రాల నాగమణి పేర్కొంది. 60 రోజులు జైల్లో ఉన్నా కన్నీళ్లు రా లేదు. నిన్న నా కొడుకును నాముందే తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకెళుతుంటే తట్టుకోలేకపోయా అని ఉద్యమ నాయకురాలు ఆరేటి సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. -
హోదా కోసం వీధి పోరాటాలకు సిద్ధం
త్యాజంపూడి (దేవరపల్లి) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వీధి పోరాటాలకు సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. దేవరపల్లి మండలం త్యాజంపూడిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ధ్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, రెండు కళ్ల సిద్ధాంతం వల్ల రాష్ట్రం నాశనమైందన్నారు. మహిళలను దారుణంగా కించపర్చే ఉపమానాలతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలను తమకు చెప్పుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏం సాధించారని ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారని ఆళ్ల నాని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు నూరుశాతం నిధులు సమకూర్చుతామని చెబుతున్న కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. దశలవారీగా నిధులు ఇస్తామని చెబుతున్న కేంద్రం ఎంత ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేస్తే దేవీపట్నం వద్ద రూ. 2,200 కోట్లతో ఎత్తిపోతల పథకం దేనికని ఆయన అన్నారు. నియోజకవర్గం సమన్వయకర్త తలారి వెంకట్రావు, నియోజకవర్గం పరిశీలకుడు పోల్నాటి బాబ్జి, మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందన సాయిబాలపద్మ, జిల్లా ప్రచార కమిటీ ఛైర్మన్ నూకపెయ్యి సుధీర్‌బాబు, మండల రైతు విభాగం అధ్యక్షుడు పల్లి వెంకటరత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.