District convener
-
ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ గా హరీష్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అఖిల భారత విద్యార్థి పరిషత్ లోని స్టూడెంట్ ఫర్ డెవెలప్మెంట్ (ఎస్ఎఫ్డి) విభాగం జిల్లా కన్వీనర్ గా హరీష్ ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల రెడ్డి ప్రకటించారు. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యం, ప్రతిభ ను వెలికితీయడం కోసం సేవాభావంతో సమాజం పట్ల అవగాహన పెంపొందించడమే ఎస్ఎఫ్డీ విభాగం ప్రధాన లక్ష్యమన్నారు. -
వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా అజీజ్
పరిగి (రంగారెడ్డి జిల్లా) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా పరిగి మండల పరిధిలోని నారాయణ్‌పూర్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అజీజ్‌ను నియమించారు. ఇదే సమయంలో మండల పరిధిలోని సయ్యద్‌పల్లికి చెందిన మరో సీనియర్ నాయకుడు మోహన్‌రెడ్డిని పరిగి మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు వారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి చేతులమీదుగా మంగళవారం నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. పార్టీ తమకు పదవులు ఇవ్వటంపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్సార్సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు
జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సిద్దవటం: వైఎస్సార్సీపీ అభ్యర్థులకే కడప మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు అన్నారు. మండలంలోని మూలపల్లె గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ ఉపాసి వెంకటసుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీలు మెజార్టీ స్థానాలలో గెలుపొందారన్నారు. 41 మంది జెడ్పీటీసీలు విజయం సాధించగా వారిలో 33 మంది క్యాంపులో ఉన్నారన్నారు. అలాగే కడప మేయర్ పదవి కూడా వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. డబ్బు, అధికార బలంతో టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్సార్సీపీకే ఈ పదవులు దక్కటం ఖాయమన్నారు.