పరిగి (రంగారెడ్డి జిల్లా) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా పరిగి మండల పరిధిలోని నారాయణ్‌పూర్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అజీజ్‌ను నియమించారు. ఇదే సమయంలో మండల పరిధిలోని సయ్యద్‌పల్లికి చెందిన మరో సీనియర్ నాయకుడు మోహన్‌రెడ్డిని పరిగి మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు వారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి చేతులమీదుగా మంగళవారం నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. పార్టీ తమకు పదవులు ఇవ్వటంపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.