
రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డితో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, నాయకులు
షాద్‌నగర్‌టౌన్ (రంగారెడ్డి): పార్టీ ఆదేశిస్తే షాద్‌నగర్ నుంచి పోటీ చేసి పార్టీ జెండాను ఎగురవేస్తానని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి విసృత సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. షాద్‌నగర్ ప్రాంత అభివృద్ధి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో నిధులు కేటాయించారని, మహానేత ప్రవేశపెట్టిన పథకాలతో చాలా మంది పేదలు లబ్ది పొందారని అన్నారు. పథకాల ప్రదాతగా పేరుపొందిన వైఎస్ రాజశేఖరరెడ్డికి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతో మంది అభిమానులు ఉన్నారని అన్నారు.
వారందరిని కలుపుకొని ఎన్నికల బరిలో నిలుస్తానని అన్నారు. గడపగడపకు వెళ్లి విసృత ప్రచారం నిర్వహిస్తానని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహానేత చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తానని అన్నారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్‌లు, ఇందిరమ్మ ఇళ్ళతో ఎంతో మంది పేదలకు లబ్ది చేకూరిందన్నారు. మహానేతను అనుక్షణం పేద ప్రజలు తలుచుకుంటూనే ఉంటారని అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఏవిధంగా ముందుకెళ్లాలి, ఓటర్లను ఏవిధంగా ఆకట్టుకోవాలని అన్న విషయాల గురించి సమావేశంలో బొబ్బిలి సుధాకర్‌రెడ్డి నేతలకు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా యువత అధ్యక్షుడు శీలం శ్రీను, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పత్తి సంతోష్, నందిగామ మండల యువత అధ్యక్షుడు వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment