district incharge
-
టీడీపీ జిల్లా సారథి చంద్రశేఖర్
జడ్చర్ల టౌన్/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : తెలుగుదేశం పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు అధికార పార్టీపై పదునైన విమర్శలు చేస్తుండడంతో ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కిందని చెబుతున్నారు. జిల్లాలో ముదిరాజ్‌ల ఓటు బ్యాంకు గణనీయంగా ఉండడం కూడా ఇదే కులానికి చెందిన చంద్రశేఖర్‌కు కలిసొచ్చినట్లయింది. ఎంపీపీగా తొలి అడుగులు చిన్నచింత కుంట ఎంపీపీగా 1995కు ముందు చంద్రశేఖర్ వ్యవహరించారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న ఎర్ర సత్యం(ఎం.సత్యనారాయణ) 1995 ఆగస్టు 12 హత్యకు గురికాగా 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2009లో మరో రెండు సార్లు భారీ మెజార్టీతోనే ఎమెల్యేగా విజయం సాధించిన ఆయన.. 2014 మినహా అన్నిసార్లు ప్రత్యర్థికి గట్టి పోటి ఇచ్చారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఘనత చంద్రశేఖర్‌కు ఉంది. పార్టీకి పూర్వవైభవం తెస్తా .. అ«ధిష్టానం తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన శుక్రవారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. అధికారపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికపుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మూడు పార్టీల అధ్యక్షులు జడ్చర్ల నుంచే.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు మరియమ్మ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వారే. ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి సైతం జడ్చర్ల నియోజకవర్గానికే చెందిన చంద్రశేఖర్‌కే దక్కడం విశేషం. కాగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎం.చంద్రశేఖర్ నియామకం ఖరారు కావడంతో శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీడీపీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కరాటే శ్రీను, నాయకులు మనోహర్, పర్శవేది, మురళి, వాజిద్, ఆంజనేయులు, రాజు, అనీల్, కేశవులు, నరేంద్ర, సునీల్, జావెద్, కిషన్ పాల్గొన్నారు. -
పొన్నాలకు తీరక..!
సాక్షి, కరీంనగర్ : జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తీరిక దొరకడం లేదు. అత్యంత కీలకమైన జిల్లా సమీక్ష మండలి సమావేశానికి పదినెలల తరువాత సమయం ఇచ్చినా.. చివరి నిమిషంలో మళ్లీ చేతులెత్తేశారు. శనివారం జరగాల్సిన డీఆర్సీ సమావేశం వాయిదా వేయించారు. తద్వారా గత ఇన్చార్జి మంత్రుల జాబితాలో పొన్నాల కూడా చేరిపోయారు. ఈయనకు ముందు జూపల్లి కృష్ణారావు, ముఖేష్‌గౌడ్ ఈ బాధ్యత నిర్వర్తించారు. వారి హయాంలో డీఆర్సీ సమావేశాల ఊసే కనిపించలేదు. లక్ష్మయ్య బాధ్యత తీసుకున్న వెంటనే అక్టోబర్ 30న సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో యంత్రాంగానికి సూచనలు ఇవ్వడంతోపాటు అధికారులకు సరైన దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించిన డీఆర్సీ ఇన్చార్జి మంత్రుల నిరాసక్తతతో నీరుగారిపోతోందని విపక్షసభ్యులు మండిపడ్డారు. ఆ సమయంలో ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని చెప్పిన పొన్నాల.. రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపికగా సమావేశంలో పాల్గొన్నారు. దీంతో క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతాయని అందరూ భావించారు. ఆ తర్వాత పదినెలలైనా ఆయన జిల్లా వైపు తొంగిచూడకపోవడంతో పాత ఇన్చార్జులకు ఈయన భిన్నం కాద ని తేలిపోయింది. సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగిందనుకుంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా సమావేశం వాయిదా వేయడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం నెలల తరబడి నిర్వహించకపోవడంతో ప్రగతిపై ప్రభావం చూపుతోంది. నీరుగారిన ప్రజాప్రతినిధుల ఆశలు జిల్లా సమస్యలపైకి ప్రభుత్వ దృష్టిని మళ్లించాలని వివిధ పార్టీల శాసనసభ్యులు భావించారు. ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన హామీలు పొంద డం ద్వారా ప్రజలు, రైతులకు భరోసా కల్పించాలని ఆశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. పంటనష్టం భారీగా ఉంది. మంథని డివిజన్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. గురువారం కూడా భారీ వర్షం నష్టాన్ని మరింత పెంచింది. మధ్య మానేరు ముంపు భాధితుల సమస్య చాలాకాలంగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. అవసరాల మేరకు యూరియా అందుబాటులో లేక రైతులు జిల్లావ్యాప్తంగా ఆందోళన బాట పడుతున్నారు. అధికారులు కొరతను తీరుస్తామంటూ చేస్తున్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చడం లేదు. విద్యుత్ కొరత తీవ్రం గా వేధిస్తోంది. లోవోల్టేజీ, అప్రకటిత కోతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో అమలులో అనేక లోటుపాట్లు బయటపడుతున్నాయి. బంగారుతల్లి పథకంపై లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. చాలాచోట్ల సీజనల్ వ్యాధులతో పల్లెలు మంచం పట్టాయి. వీటన్నింటిపై చర్చిం చి ప్రజలకు అండగా నిలిచేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించాలని విపక్షా లు ఆశించాయి. తీరా సమయానికి సమావేశం వాయిదా పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల నుంచి దాడి తప్పదని భావిం చే వాయిదా వేయించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఆర్సీ వాయిదా : సీపీవో శనివారం జరగాల్సిన డీఆర్సీ సమావేశం అని వార్య కారణాలతో వాయిదా పడిందని ముఖ్య ప్రణాళిక అధికారి పి.సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు.