రూరల్ అధ్యక్షునిగా ‘పప్పల'
- అర్బన్ జిల్లా అధ్యక్షునిగా వాసుపల్లి
- ప్రకటించిన టీడీపీ అధిష్టానం
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్ష పదవి మాజీ ఎంపీ పప్పల చలపతిరావును వరించింది. ఐదు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు అధిష్టానం తెరదించింది. అర్బన్ జిల్లా అధ్యక్షునిగా వాసుపల్లి గణేష్ కుమార్,రూరల్జిల్లా అధ్యక్షునిగా చలపతిరావును ఖరారు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం గురువారం రాత్రి ప్రకటించింది. అర్బన్, జిల్లా కమిటీ లను ప్రకటిం చలేదు. రెండుచోట్ల కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవుల ఎంపిక విషయంలో ఏకాభి ప్రాయం కుదరకపోవడం వలనే కమిటీ ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. కమిటీల కోసం ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు రోజంతా చర్చోపచర్చలుసాగించినా మంత్రులు,ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు.
చివరకు నిర్ణయాధికారాన్ని అధిష్టానం చేతుల్లో పెట్టేశారు. అధిష్టానం కూడా గత ఐదురోజులుగా నాన్చుతూ చివరకు గురువారంరాత్రి అధికారకంగా ప్రకటించింది. రూరల్ అధ్యక్షునిగా ఉన్న గవిరెడ్డి రామానాయుడ్నిని కొనసాగించాలని అయ్యన్న, వద్దంటూ గంటా పట్టుబట్టారు. గంటా వర్గానికి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస రావు, ఆడారి ఆనంద్, లా లంభాస్కర్ల పేర్లను ప్రతిపాదించినా అయ్యన్న వర్గీయులు ససేమిరా అనడంతో చివరకు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు పరిశీలనకువచ్చింది. ఇ రువురు మంత్రులతో అధినేత చంద్రబాబు చర్చించిన తర్వాత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన అధిష్టానం మధ్యేమార్గంగా చలపతిరావు పేరును ఖరారుచేసింది.