అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు. కార్యక్రమానికి డీవైఈఓ లక్ష్మినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారిలో అత్యంత ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ చెప్పారు.ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 18 నుంచి 20 వరకు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు.
అండర్–14 బాలుర జట్టు
సతీష్, నితీష్, ప్రసాద్నాయక్, వినయ్, తరుణ్, పురుషోత్తం, తేజ, శివ
అండర్–14 బాలికల జట్టు
మమత, లక్షీ, శాంతకుమారి, చైతన్య, భవ్య, పద్మ, గంగోత్రి, బృందారిక