district voters
-
నేడు స్పెషల్ డ్రైవ్..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ యువతను, ఇప్పటి వరకూ వివిధ కారణాలతో నమోదు చేసుకోని వారికోసం మరో అవకాశం కల్పించింది. ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 28లక్షల 70వేలకు పైగానే ఉన్నారు. జనాభా ప్రకారం చూస్తే ఇంకా జిల్లాలో ఓటరుగా అర్హత ఉన్న వారు చాలా మంది ఉన్నారనేది ఎన్నికల కమిషన్ అంచనా. ప్రతీ సారి చేపట్టిన డ్రైవ్‌లో కొత్తగా నమోదు చేసుకొన్న వారికి దీటుగా తొలగింపులు కూడా ఉండడంతో పెరుగుదల అంతంతమాత్రమే ఉంటోంది. ఇక ఓటరుగా చేరేందుకు చాలా మంది దరఖాస్తులు చేసుకున్నా అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశకు గురికావాల్సి వస్తోంది. ఆన్లైన్లో నమోదు చేసుకొన్న దరఖాస్తుల్ని పట్టించుకొనే వారే లేకపోవడంతో, వాటిని విచారణ లో తొలగిస్తున్నట్లుఅధికారులుయధాలాపం గా ప్రకటిస్తుంటారు.ఈ కారణంగా ఎన్నిసా ర్లు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టినా, ఇంకా అర్హత ఉన్న వారంతా మిగిలిపోతూనే ఉన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చే శారు. ఇందులో భాగంగా ప్రతీ పోలింగ్ బూత్‌లో బూత్ లెవల్ అధికారులు ఆదివా రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉండి కొత్త దరఖాస్తులతోపాటు, మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను సేకరించాల్సిందిగా సిబ్బందికి సూచించారు. అదే విధంగా కొత్త జాబితాను పోలింగ్ కేంద్రాల్లో గోడపై అతికించడంతోపాటు, అందరికి అందుబాటులో ఉంచి, వారికి అవకాశం కల్పిస్తారని ప్రకటించారు. -
పురుషాధిక్యం..!
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్లనమోదు ప్రక్రియ ఈ సారి కొత్త రికార్డులను సృష్టించింది. జిల్లాపై గతంలో ఎనిమిది వేల పైచిలుకు ఆధిక్యత చాటుకున్న మహిళలను ఈమారు పురుషులు అధిగమించారు. ఇక ప్రత్యేక ఓటర్లు 204 మందికి హక్కు లభించింది. పాలమూరులో వనపర్తి ఓటర్లుతో అగ్రతాంబూలం అందుకుంటే జిల్లా కేంద్రం వెనుకబడింది. మొత్తానికి అధికారికంగా జాబితా వెలువడనుంది. కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఓటర్ల సంఖ్యను అధికారులు తేల్చారు. మార్పులు చేర్పుల అనంతరం, కొత్త వారికి అవకాశం కల్పించగా, ఈసారి మనజిల్లా ఓటర్లు 28,43,892కు చేరింది. వీరిలో పురుషులు 14,28,966, మహిళలు 14,14, 518 ఉన్నట్లు తేల్చారు. ఇక ఇటీవల కాలం లో చేపట్టిన ఓటర్ డ్రైవ్‌కు 1,40,801దరఖాస్తులు రాగా, వాటిలో కేవలం సగం మందికే 71,254మందికి కొత్తగా అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తుల్లో విచారణ పేరిట 37,917, జాబితా విడుదల అనంతరం 31,630దరఖాస్తులు వచ్చాయని వాటిని పక్కన పెట్టారు. ఇతరుల కాలంలో... మహిళలు, పురుషులు జాబితాలోకి రాకుండా ఉన్న ‘ప్రత్యేక’ ఓటర్లు ఈసారి 204మంది ఉన్నట్లు తేల్చారు. వీరిని నివేదికలో ఇతరుల కాలంలోకి చేర్చారు. దీటుగానే తొలగింపు... ఇది వరకు విడుదల చేసిన జాబితాల్లోంచి 54,616మందిని తొలగించారు. వీరిలో చనిపోయిన వారు 16,142, ఇతర పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారు 23,706, రెండుచోట్ల నమోదైనవి 14,768 వంతున ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇక ఈసారి విచారణలో 37,917, జాబితా వి డుదల చేశాక పక్కన పెట్టిన దరఖాస్తులు 31,630 మొత్తం 69, 547మంది అవకాశా న్ని కోల్పోయారు. దీంతో పాత జాబితా కొత్త జాబితా కలిసి 1,24,163మందిని అధికారులు తొలగిం చినట్లేనని తెలుస్తోం ది. గతేడాది జిల్లా ఓ టర్లు 27,72,434 ఉండగా, ఈసారి కేవ లం లక్షల్లో దరఖాస్తు లు వచ్చినా కేవలం 71,254మందికి అవకాశం కల్పిం చడంతో కాస్తే పెరి గింది. తొలగింపుకోసం 25వేలు... ఈసారి గతంలో లేని విధంగా తొలగింపున కు 25,315దరఖాస్తులు రాగా,వాటిలో 22, 986దరఖాస్తులను పరిష్కరించి, 2,329 అభ్యర్థనలను పెండింగ్‌లో పెట్టారు. నెంబర్‌వన్‌లో వనపర్తి..... జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే వనపర్తి నెంబర్‌వన్ స్థానంలో ఉంది. అందుకేనేమో వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చాలని నేతలు పట్టుబడుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లో కొత్త వాటికంటే తొలగించినవే ఎక్కువగా ఉన్నాయి. సిద్దం చేసిన ఓటరు తుది జాబితాను అధికారులు నేడు అధికారికంగా విడుదల చేయనున్నారు. విడుదల చేసిన జాబితాను పోలిం గ్ కేంద్రాలతోపాటు, అన్ని రాజకీయపార్టీలకు అందజేయనున్నారు. -
ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటే ఆయుధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఉత్తమ ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు బలమైన ఆయుధమని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. నా లుగవ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివా రం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనేదే ఓటర్ల దినోత్సవ లక్ష్యమని పే ర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతులను చేయాలన్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటర్ల నమో దు కార్యక్రమం ద్వారా అర్హులందరినీ చేర్పించామని తెలిపారు. పస్తుతం జిల్లా ఓటర్లు 27,43,754 ఉన్నారని, వీరిలో 13,78,754 మంది పురుషులు, 13,67,000 మంది మహిళలు ఉన్నారని వివరించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారికి ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. జిల్లా జడ్జి నాగమారుతీ శర్మ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైందని, ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వేయాలని పేరొన్నారు. శాతవాహన వీసీ వీరారెడ్డి మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగితే ఉత్తములే ఎన్నికల్లో విజయం సాధిస్తారని, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని వివరించారు. డీఐజీ భీమా నాయక్ , ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లకు సన్మానం ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్కువసార్లు ఓటింగ్‌లో పాల్గొన్న సీనియర్ సిటిజన్లను సన్మానించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృ్తత్వం, పేయింటింగ్, క్విజ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. ప్రత్యేక ఓటరు నమోదుకు కృషి చేసిన వివిధ కళాశాల ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కెడెట్లకు ప్రశంసాపత్రాలు అందించారు. అంతకుముందు విద్యార్థులతో సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో కృష్ణారెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్, స్వాతంత్య్ర సమరయోధుడు బోయినిపల్లి వెంకటరామారావు, జిల్లా అధికారులు, యూత్ సోషల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు కిరణ్, డి.ప్రశాంత్, వలుస సుభాష్, రాజేశ్, కళింగ శేఖర్, సంపత్‌కుమార్, శివరాం, రాకేశ్, లోక్‌సత్తా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.