కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ యువతను, ఇప్పటి వరకూ వివిధ కారణాలతో నమోదు చేసుకోని వారికోసం మరో అవకాశం కల్పించింది. ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 28లక్షల 70వేలకు పైగానే ఉన్నారు.
జనాభా ప్రకారం చూస్తే ఇంకా జిల్లాలో ఓటరుగా అర్హత ఉన్న వారు చాలా మంది ఉన్నారనేది ఎన్నికల కమిషన్ అంచనా. ప్రతీ సారి చేపట్టిన డ్రైవ్‌లో కొత్తగా నమోదు చేసుకొన్న వారికి దీటుగా తొలగింపులు కూడా ఉండడంతో పెరుగుదల అంతంతమాత్రమే ఉంటోంది. ఇక ఓటరుగా చేరేందుకు చాలా మంది దరఖాస్తులు చేసుకున్నా అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశకు గురికావాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొన్న దరఖాస్తుల్ని పట్టించుకొనే వారే లేకపోవడంతో, వాటిని విచారణ లో తొలగిస్తున్నట్లుఅధికారులుయధాలాపం గా ప్రకటిస్తుంటారు.ఈ కారణంగా ఎన్నిసా ర్లు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టినా, ఇంకా అర్హత ఉన్న వారంతా మిగిలిపోతూనే ఉన్నారు.
ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చే శారు. ఇందులో భాగంగా ప్రతీ పోలింగ్ బూత్‌లో బూత్ లెవల్ అధికారులు ఆదివా రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉండి కొత్త దరఖాస్తులతోపాటు, మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను సేకరించాల్సిందిగా సిబ్బందికి సూచించారు. అదే విధంగా కొత్త జాబితాను పోలింగ్ కేంద్రాల్లో గోడపై అతికించడంతోపాటు, అందరికి అందుబాటులో ఉంచి, వారికి అవకాశం కల్పిస్తారని ప్రకటించారు.
నేడు స్పెషల్ డ్రైవ్..!
Published Sun, Mar 9 2014 3:55 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement