dk aruna fasting
-
డీకే అరుణ దీక్ష.. ఓ డ్రామా
-
డీకే అరుణ దీక్ష.. ఓ డ్రామా
జిల్లాల కోసం డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ కోసం ఆమె ఎలాంటి ఉద్యమాలు చేయలేదని అన్నారు. గద్వాలను జిల్లా చేయాలని ప్రజలు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని జూపల్లి చెప్పారు. రాజకీయాల కోసం ఇప్పుడు జిల్లాల విభజన జరగడం లేదని, కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలను విభజిస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.