dlpo
-
‘అరబిందో’ భూమిపై డీఎల్పీవో విచారణ
తిమ్మాపురం (కాకినాడ రూరల్) : తిమ్మాపురం పంచాయతీకి చెందిన రెండు ఎకరాల భూమిని 2000లో అప్పటి సర్పంచ్ కర్రి ఆదిలక్ష్మి అరబిందో సొసైటీ ట్రస్టుకు అతి తక్కువ ధరకు ఇచ్చారని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ ప్రస్తుత సర్పంచ్ అనుసూరి జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణమూర్తి చేసిన ఫిర్యాదుపై సోమవారం డీఎల్పీవో నాగలత తిమ్మాపురంలో విచారణ చేపట్టారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం ఆమె భూమిని పరిశీలించారు. డీఎల్పీవో తెలిపిన వివరాల ప్రకారం.. 2000లో అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ చెల్లప్ప ఆదేశాలపై అప్పటి కలెక్టర్ సతీష్‌చంద్ర ఉత్తర్వులు ఇవ్వడంతో డీపీవో శ్రీధర్‌రెడ్డి తిమ్మాపురంలో అరబిందో సొసైటీ ట్రస్టుకు 2 ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చినట్టు తీర్మానాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. దీనిపై అప్పటి పంచాయతీ పాలకవర్గం తీర్మానం నంబర్ 30 ప్రకారం లే అవుట్ నంబర్ 34/98లోని సామాజికి స్థలం ఎ. 0.56 సెంట్లు, లేఅవుట్ నంబర్ 130/98లోని సామాజిక స్థలం ఎ.0,58 ట్లు మొత్తం ఎ1.14 సెంట్లు భూమిని అరబిందో సొసైటీకి అప్పగించినట్టు తీర్మానాలు రాశారు. ఈ భూమి సరిపోదని స్కూల్‌కు ఆట స్థలం కావాలని దీనికి సంబంధించి మొత్తం 2 ఎకరాల భూమి కావాలని దరఖాస్తు చేయడంతో పంచాయతీ పాలక వర్గం ఎల్‌పీనంబర్ 34/98లో రూ. 60 అడుగు రోడ్డు, 40 అడుగుల రోడ్డు మధ్య ఉన్న 0.86 సెంట్లు భూమి అరబిందో సొసైటీకి ఇచ్చారు. అరబిందో సొసైటీ ట్రస్ట్‌కు భూమిని బదలాయించినా నేటికీ వారు ఆ భూమిని ఏ విధంగాను వినియోగించలేదన్నారు. అప్పట్లో సొసైటీకి భూమి గజాల్లో అమ్మాల్సి ఉండగా కేవలం ఎకరాల్లో అమ్మారని దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం నష్టపోయిందని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్‌లు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రికార్డుల పరిశీలనకు వచ్చానని నాగలత తెలిపారు. అప్పట్లో ఈ భూమికి సంబంధించిన ఎల్పీలు, తీర్మానాలు తప్ప మరే ఇతర రికార్డులు సక్రమంగా లేవని, పూర్తిస్థాయిలో రికార్డులు సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావును డీఎల్పీవో ఆదేశించారు. ఇప్పటికైనా పోయింది ఏమీలేదని ఆ భూమిని తిరిగి తీసుకొనే అధికారం పంచాయతీ పాలకవర్గానికి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే దరిమిలా ఓ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చి భూమిని కేటాయించాలని కోరితే ప్రస్తుతం ఈ భూమిని ఏ విధంగా తిరిగి తీసుకోవాలనే దానిపై కూడా పునరాలోచించాల్సిన ఆవశ్యకతపై కూడా అధికారులు చర్చించారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని డీఎల్పీవో నాగలత తెలిపారు. ఈ భూమిని తిరిగి పంచాయతీకి బదలాయించాలని ఉపసర్పంచ్ బెజవాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈవోపీఆర్డీ పి.మణీశ్వరరావు, సర్పంచ్ అనుసూరి జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
నిధుల దుర్వినియోగంపై డీఎల్పీవో దర్యాప్తు
తలతంపర (సంతకవిటి) : తలతంపర పంచాయతీలో అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యులు నిధుల దుర్వినియోగం చేయడంపై పాలకొండ డీఎల్పీవో పి.సత్యన్నారాయణ మంగళవారం దర్యాప్తు నిర్వహించారు. పంచాయతీలో మొత్తం ఎనిమిది మంది వార్డు సభ్యులు ఉండగా వీరిలో మాజీ సర్పంచ్ రుగడ జగన్నాధం, పోలాకి బృందావతి, యాగాటి పోలమ్మ, చిలకలపల్లి దుర్గమ్మ తదితరులు పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని పాలకొండ పంచాయతీ అధికారి పి.సత్యన్నారాయణకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పంచాయతీకి సంబంధించి రూ. 3.25 లక్షలు మేర నిధులను ఇదే పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు మరో ముగ్గురు వార్డు సభ్యులు తినేసినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్లు జగన్నాధం సాక్షికి తెలిపారు. ఈ మేరకు పాలకొండ డీఎల్పీఓ సత్యన్నారాయణ గ్రామానికి చేరుకుని పంచాయతీ కార్యాలయం వద్ద దర్యాప్తు నిర్వహించారు. నిధుల వినియోగంపై ఆరా తీశారు. రికార్డులు లేవు... ఇదిలా ఉండగా పంచాయతీ నిధుల దుర్వినియోగానికి సంబం«ధించి ఆరా తీసేందుకు అక్కడ రికార్డులు లేవు. దీంతో డివిజనల్ పంచాయతీ అధికారి పంచాయతీ ఉప సర్పంచ్ కొరికాన వసంత వద్ద వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి అప్పలసూరిని మందలించారు. వారం రోజుల్లోగా పంచాయతీ రికార్డులు అందించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీ సిబ్బందిని హెచ్చరించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ఈవోపీఆర్డీ జి. వేణుగోపాలనాయుడుకు సూచించారు. ముందుగా సీసీ రోడ్లు నిమిత్తం తీసేసిన నిధులును సక్రమంగా సకాలంలో వినియోగించాలని పాలక మండలి సభ్యులకు సూచించారు. ఈ నిధులు సక్రమంగా వినియోగించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తం వివరాలు నమోదు చేసుకుని వాటిని జిల్లా అధికారులకు నివేదించనున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారుల హస్తం ఉంది... పంచాయతీలో నిధుల దుర్వినియోగం చేస్తున్నారని పంచాయతీ మాజీ సర్పంచ్ రుగడ జగన్నాధం సాక్షికి తెలిపారు. గతంలో కూడా పలు ఆరోపణలు పంచాయతీలో పాలక మండలిపై ఉన్నాయని చెప్పారు. తాము నలుగురు వార్డు సభ్యులం ఉన్నా తమకు తెలియకుండా తీర్మానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రోడ్లు నిర్మిస్తామని చెప్పి ముందుగానే నిధులు తీసేశారని, పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి పడుతూ నిధులు కాజేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. -
దత్తాయపల్లిలో డీఎల్పీఓ విచారణ
తుర్కపల్లి : మండలంలోని దత్తాయపల్లి గ్రామపంచాయితీ సర్పంచ్ ధ్యానబోయిన సరిత నిధులు దుర్వినియోగం చేశారని ఉపసర్పంచ్ ఎరకల వెంకటేశ్‌గౌడ్ కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎల్పీఓ సత్యనారాయణరెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా ఇరుపక్షాల నుంచి రాత పూర్వకంగా వాగ్ములాలను స్వీకరించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధ్యానబోయిన సరిత, ఈఓపీఆర్డీ చంద్రమౌళి, వార్డుసభ్యులు, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరిగి జీపీని సందర్శించిన డీఎల్పీఓ
గ్రామ పంచాయతీలో రికార్డుల పరిశీలన పరిగి: గ్రామ పంచాయతీల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని చేవెళ్ల డీఎల్పీఓ రాణిబాయి అన్నారు. శుక్రవారం ఆమె పరిగి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. గతంలో వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చానని ఆమె తెలిపారు. పలు అంశాల్లో ఆమె సర్పంచ్ విజయమాలతో చర్చించారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే పూడూరు మండల ఈఓపీఆర్డీ విచారణ జరిపి నివేదిక సమర్పించినందున అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. పంచాయతీల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోయిన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజల విన్నపాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు, ప్రధానంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
డీఎల్పీఓ విచారణ
బొమ్మలరామారం : మండలంలోని మేడిపల్లి, మాచన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కుంటున్న నిధుల దుర్వినియోగం అభియోగాలపై గురువారం డీఎల్పీఓ రవి కుమార్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు, అభియోగాలు ఎదుర్కుంటున్న సర్పంచ్ల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. అనంతరం రికార్డులను సీజ్ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శంకరయ్య, కష్ణ, ఎంపీటీసీ మేడబోయిన శశికళగణేష్, ఉప సర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు దేవదాసు, ఎల్లమ్మ రత్నమాల,మంగ, మల్లేష్, రమేష్ పాల్గొన్నారు. -
ప్రధాని సందేశం వినేందుకు ఏర్పాట్లు చేయండి
డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీ, కార్యదర్శులకు డీపీఓ అరుణ ఆదేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జాతీ య పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ జాతికిచ్చే సందేశాన్ని వినేందుకు గ్రామ పంచాయతీల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను డీపీఓ అరుణ ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర, పంచాయతీ రాజ్ వ్యవస్థ తీరుతెన్నులు తదితర అంశాలపై ప్రధాని ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని వినేందుకు, చూసేందుకు ఆయా గ్రామ పంచాయతీల్లో టీవీలు, రేడియోలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ మేరకు తగు ప్రచారం కల్పించాలని ఆమె ఆయా డివిజన్ల డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీలకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పాలన @ ఆన్లైన్
ఏలూరు, న్యూస్‌లైన్:పల్లె పాలన ఆన్లైన్ పట్టాలెక్కబోతోంది. ‘ఈ-పంచాయత్స్’ పేరిట పంచాయతీల్లో ఆన్లైన్ సేవలను వినియోగించుకునేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జాతీయ సాంకేతిక సమాచార సంస్థ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. జూన్ మొదటి వారంలోగా జిల్లాలోని 531 కస్లర్ల కింద 858 గ్రామ పంచాయతీల్లో ‘ఈ-పంచాయత్’ విధానాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే 531 కంప్యూటర్లు, ఇతర పరికరాలు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలకు చేరాయి. మూడంచెల విధానం మూడేళ్ల క్రితమే జిల్లాలో 21 పంచాయతీల్లో ఈ-పంచాయత్ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఆన్లైన్ సేవలను పర్యవేక్షించే బాధ్యతను కార్వే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థ ప్రతినిధులు పంచాయతీ సిబ్బందికి ఆన్లైన్ విధానంపై శిక్షణ ఇచ్చారు. ప్రాథమికంగా గ్రామాల్లో జనన, మరణాల నమోదు, ఇంటి పన్నులు, లెసైన్స్ ఫీజు వసూళ్లను ఆన్లైన్ చేయనున్నారు. పనుల పర్యవేక్షణ, పంచాయతీ సమావేశాలు, ప్రజాప్రతినిదుల సమాచారం, ఉద్యోగుల వివరాలు, వేలం నోటీసులు, కోర్టు కేసులు, తనిఖీలు, సమాచార హక్కు చట్టం, ఆడిట్, ఫిర్యాదులకు సంబంధించిన ఎంఐఎస్ రిపోర్టులు, పంచాయతీరాజ్ నిధులకు సంబంధిం చిన సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచుతారు. దీనిపై ఇప్పటికే సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చామని, ఆపరేటర్లకు శిక్షణ పూర్తయియందని డీపీవో అల్లూరి నాగరాజు వర్మ తెలిపారు. నేడు డీఎల్పీవోలు, ఈవోఆర్డీలకు అవగాహన గ్రామాల్లో ఆన్ లైన్ సేవలపై జిల్లాలోని ఈవోఆర్డీలు, నలుగురు డీఎల్పీవోలతో కార్వే సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక డీపీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని డీపీవో చెప్పారు.