Doctor kidnapped
-
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు.. పక్కా స్కెచ్‌తో!
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్లలోని మన్నెగూడలో కిడ్నాప్ అయిన డాక్టర్ వైశాలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. యువతిని పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. పట్టపగలే 100 మంది ఇంట్లోకి వచ్చి యువతిని కిడ్నాప్ చేయడం వెనక స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిడ్నాప్‌కు పాల్పడిన నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసిన 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. తన కూతురు కిడ్నాప్‌కు మరికొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. కూతురిని నవీన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలంటూ తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఒత్తిడి చేశారని తెలిపారు. నవీన్ రెడ్డితో వివాహం ఇష్టం లేక గతంలో ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లిచూపులు ఉన్నాయని తెలిసే ఇదిలా ఉండగా.. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని గత ఆరు నెలలుగా నవీన్ రెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ గతంలో వైశాలి, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే వైశాలి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని టీస్టాల్ ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో వివాహం చేసుకునేందుకు వైశాలి సిద్ధపడిందని, ఈ రోజు పెళ్లిచూపులు ఉన్నాయని తెలుసుకున్న నవీన్ రెడ్డి 100 మంది కిరాయి గుండాలతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు ధ్వంసం చేశారు. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వైశాలి తండ్రిని, అడ్డుకోబోయిన పలువురు స్థానికులను కూడా చితకబాదారు. యువతి ఇంటి సమీపంలోనే టీస్టాల్ నడుపుతున్న నవీన్ రెడ్డి.. అక్కడికి వచ్చే వ్యక్తులు, కొంతమంది స్టూడెంట్స్‌కు డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారిలో ఇప్పటికే 40 మందికి పైగా యువకులను గుర్తించారు. కిడ్నాప్ తర్వాత అమ్మాయిను నవీన్ రెడ్డికి అప్పగించి యువకులు పరారయ్యారు. పథకం ప్రకారమే సెల్ ఫోన్లు వాడకుండా స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. ఎలాంటి ఆధారాలు దొరకవద్దని వైశాలి ఇంటివద్ద పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కిడ్నాప్ కేసు కొలిక్కి సంచలనం సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. వైశాలి తన తల్లిదండ్రులకు కాల్ చేయడంతో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. యువతి నల్గొండలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నల్గొండ పోలీసులకు సమాచారం ఇచ్చిన రాచకొండ పోలీసులు వైశాలి ఉన్న స్పాట్‌కు తండ్రితోపాటు వెళ్లారు. కిడ్నాపర్ నవీన్‌ను అదుపులోకి తీసుకొని.. వైశాలిని రక్షించారు. కాగా అంతకుముందే వైశాలి తన తల్లిదండ్రులకు కాల్ చేసి సేఫ్‌గా ఉన్నట్లు, ఆందోళన చెందవద్దని చెప్పిన సంగతి తెలిసిందే. -
డాక్టర్ కిడ్నాప్..రూ. 5 లక్షలు వసూలు
కర్ణాటక, యశవంతపుర : అయుర్వేద డాక్టర్‌ను కారులో అపహరించి, చిత్రహింసలకు గురిచేసి అతని వద్ద నగదు, బంగారు ఉంగరాలు దోచుకెళ్లిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... అగ్రహర దాసరహళ్లికి చెందిన డాక్టర్ రవికుమార్ సుంకదకట్ట శ్రీనివాస నగరలో క్లినిక్ నడుపుతున్నారు. ఈ నెల 18న రాత్రి 10 గంటలకు విధులు ముగించుకోని బైక్‌లో వెళ్తుండగా మాగడి రోడ్డు కేహెచ్‌బీ కాలనీ అండర్‌పాస్ వద్ద అడ్డగించిన ముగ్గురు దుండగులు చాకుతో బెదిరించి కారులో అపహరించారు. నిన్ను హత్య చేయడానికి మరో డాక్టర్ రూ. 5 లక్షల సుపారీ ఇచ్చాడని రవికి చెప్పారు. నీవు రూ. 6 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పడంతో తీవ్ర భయాందోళనకు గురైన రవికుమార్ తనకు తెలిసిన మరో డాక్టర్‌కు వారి నుంచి ఫోన్ చేయించి నగదు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో సదరు డాక్టర్, రవి కుమార్ ఇంటికి వెళ్లి విషయం వివరించి రవి సోదరి నుంచి రూ. 5 లక్షలు తీసుకుని కిడ్నాపర్లు చెప్పిన ప్రాంతానికి వచ్చి నగదు ముట్టజెప్పాడు. ఈ క్రమంలో డాక్టర్ రవికుమార్ సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడాన్ని కిడ్నాపర్లు పసిగట్టి రవి కుమార్‌ను తీవ్ర హెచ్చరించారు. అనంతరం దుండగులు రవిని నాగరబావి సర్కిల్లో దించి వెళ్లిపోయారు. తనకు పరిచయం ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి ఉంటారని రవికుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కామాక్షిపాళ్య పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాప్ చేసిందెవరు?
పేషెంట్స్, నర్సులు, ఆపరేషన్లతో బిజీ బిజీగా ఉండాల్సిన డాక్టర్ ఎక్కడో హిల్ స్టేషన్లో రాత్రివేళలో కాళ్లూ చేతులు కట్టివేయబడి ఉన్నారు. చూస్తుంటే ఆ లేడీ డాక్టర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని అర్థం అవుతుంది. మరి.. ఈ కిడ్నాప్ వెనకాల ఉన్నది ఎవరు? అసలెందుకు కిడ్నాప్ చేశారనేది ‘పరమపదమ్ విలయాట్టు’ సినిమాలో తెలుస్తుంది. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పరమపదమ్ విలయాట్టు’. తిరుజ్ఞానమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ఓ లేడీ డాక్టర్‌గా త్రిష కనిపిస్తారు. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. నంద, రిచర్డ్, ఏఎల్ అళగప్పన్, వేలా రామ్మూర్తి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అమరేష్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, త్రిష ముఖ్య తారలుగా నటించిన లవ్‌స్టోరీ ‘96’ అక్టోబర్ 4న విడుదల కానుంది. -
డాక్టర్ కిడ్నాప్: రూ. 55 లక్షల డిమాండ్
ఉత్తరప్రదేశ్: యూపీలో ఓ వైద్యుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఈటావా పట్టణానికి చెందిన డాక్టర్ జ్ఞాన్ ప్రకాశ్ పాండేను కిడ్నాప్ చేసిన దుండగులు రూ. 55 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం విధులకు వెళ్లిన జ్ఞాన్ ప్రకాశ్ పాండే తిరిగి రాకపోవడంతో కంగారు పడిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి రూ. 55 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా అగంతకులను పట్టుకోవడానికి యత్నిస్తున్నారు. -
డీల్ కుదిరితే దారుణాలే
వరంగల్ క్రైం : వారికి మంచి, చెడులతో సంబంధం లేదు.. అవతలి వ్యక్తి డబ్బు ఇస్తే ఎంతటికైనా తెగిస్తారు. పగ.. ప్రతీకారంతో రగిలిపోయే కొందరికి చేతికి మట్టి అంటకుండా పనిచేసి పెడతారు. అందుకు వారు పెద్ద మొత్తంలోనే ‘సుపారీ’ తీసుకుంటారు. ఇన్నాళ్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన ఈ ముఠాలు జిల్లాలోనూ అడపాదడపా హల్చల్ సృష్టిస్తున్నారుు. కాంట్రాక్ట్ మర్డర్లు, కిడ్నాప్‌ల సంస్కృతి జిల్లాలోనూ వ్యాపించడంతో వ్యాపార వర్గాలు, ఇతర ప్రముఖులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ తగాదాలు, ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేయడంలాంటి అసాంఘిక కార్యకలాపాలకు హైదరాబాద్ తర్వాత వరంగల్ కేంద్రం బిందువుగా మారుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నారుు. వ్యక్తిగత కక్షలతో ఒకటి, రెండు హత్యలు లేదా హత్యాయత్నాలకు పాల్పడిన వ్యక్తులే ఎక్కువగా ఇలాంటి సుపారీ కేసుల్లో నిందితులుగా ఉండడం గమనార్హం. నేరగాళ్లపై కొరవడిన నిఘా ఒకటి, రెండు హత్యలు, హత్యాయత్నం కేసులతోపాటు ఇతర క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారు ఇలాంటి పనులకు శ్రీకారం చుడుతున్నారనే ఆరోపణలు ఉన్నారుు. కరడుగట్టిన నేరస్తులు, మాజీ నక్సలైట్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు చెలరేగిపోతున్నారు. సుపారీ కేసుల్లో ఉన్నవారంతా పాతనేరస్తులే కావడం గమనార్హం. ఇలాంటి సుపారీ కిడ్నాప్‌లు, హత్యలకు పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ కిడ్నాప్‌తో సంచలనం హన్మకొండలో మార్చి 21న జరిగిన పిల్లల డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి వద్ద సుపారీ తీసుకునే కిడ్నాపర్లు ఈ పనికి పూనుకున్నారనే అనుమానాలు ఉన్నారుు. డాక్టర్‌ను కిడ్నాప్ చేయడానికి రెండు రోజుల ముందు హుజురాబాద్‌లో ఆయన నిర్వహిస్తున్న క్లినిక్ ను మూసివేయూలని ఫోన్లో బెదిరించడాన్ని బట్టి.. సుపారీ తీసుకుని చేసిన కిడ్నాప్‌గా భావించాల్సి వస్తోంది. ఈ కేసు మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన తర్వాత నగరంలో వరుసగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. జఫర్‌గఢ్ ఎంపీటీసీ సభ్యురాలి భర్తను హత్యచేసేందుకు సుపారీ తీసుకుని హంతకులు పట్టుబడ్డారు. ఇదే తరహాలో హన్మకొండ ములుగురోడ్డులో ఒక గ్యాంగ్, వరంగల్‌లో మరో గ్యాంగ్ నాలుగు రోజుల క్రితం పట్టబడింది. అరుుతే ఈ మూడు ఘటనల్లోనూ ముందే ముఠా సభ్యులు పోలీసులకు చిక్కడంతో బాధితులకు ప్రమాదం తప్పినట్లరుుంది. పోలీసులు సకాలంలో స్పందించకుంటే రెండు హత్యలు, ఒక కిడ్నాప్ జరిగి ఉండేదని తెలుస్తోంది.