డీల్ కుదిరితే దారుణాలే
వరంగల్ క్రైం : వారికి మంచి, చెడులతో సంబంధం లేదు.. అవతలి వ్యక్తి డబ్బు ఇస్తే ఎంతటికైనా తెగిస్తారు. పగ.. ప్రతీకారంతో రగిలిపోయే కొందరికి చేతికి మట్టి అంటకుండా పనిచేసి పెడతారు. అందుకు వారు పెద్ద మొత్తంలోనే ‘సుపారీ’ తీసుకుంటారు. ఇన్నాళ్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన ఈ ముఠాలు జిల్లాలోనూ అడపాదడపా హల్‌చల్ సృష్టిస్తున్నారుు. కాంట్రాక్ట్ మర్డర్లు, కిడ్నాప్‌ల సంస్కృతి జిల్లాలోనూ వ్యాపించడంతో వ్యాపార వర్గాలు, ఇతర ప్రముఖులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ ఘటనల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ తగాదాలు, ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేయడంలాంటి అసాంఘిక కార్యకలాపాలకు హైదరాబాద్ తర్వాత వరంగల్ కేంద్రం బిందువుగా మారుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నారుు. వ్యక్తిగత కక్షలతో ఒకటి, రెండు హత్యలు లేదా హత్యాయత్నాలకు పాల్పడిన వ్యక్తులే ఎక్కువగా ఇలాంటి సుపారీ కేసుల్లో నిందితులుగా ఉండడం గమనార్హం.
నేరగాళ్లపై కొరవడిన నిఘా
ఒకటి, రెండు హత్యలు, హత్యాయత్నం కేసులతోపాటు ఇతర క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారు ఇలాంటి పనులకు శ్రీకారం చుడుతున్నారనే ఆరోపణలు ఉన్నారుు. కరడుగట్టిన నేరస్తులు, మాజీ నక్సలైట్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు చెలరేగిపోతున్నారు. సుపారీ కేసుల్లో ఉన్నవారంతా పాతనేరస్తులే కావడం గమనార్హం. ఇలాంటి సుపారీ కిడ్నాప్‌లు, హత్యలకు పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డాక్టర్ కిడ్నాప్‌తో సంచలనం
హన్మకొండలో మార్చి 21న జరిగిన పిల్లల డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి వద్ద సుపారీ తీసుకునే కిడ్నాపర్లు ఈ పనికి పూనుకున్నారనే అనుమానాలు ఉన్నారుు. డాక్టర్‌ను కిడ్నాప్ చేయడానికి రెండు రోజుల ముందు హుజురాబాద్‌లో ఆయన నిర్వహిస్తున్న క్లినిక్ ను మూసివేయూలని ఫోన్‌లో బెదిరించడాన్ని బట్టి.. సుపారీ తీసుకుని చేసిన కిడ్నాప్‌గా భావించాల్సి వస్తోంది.
ఈ కేసు మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన తర్వాత నగరంలో వరుసగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. జఫర్‌గఢ్ ఎంపీటీసీ సభ్యురాలి భర్తను హత్యచేసేందుకు సుపారీ తీసుకుని హంతకులు పట్టుబడ్డారు. ఇదే తరహాలో హన్మకొండ ములుగురోడ్డులో ఒక గ్యాంగ్, వరంగల్‌లో మరో గ్యాంగ్ నాలుగు రోజుల క్రితం పట్టబడింది. అరుుతే ఈ మూడు ఘటనల్లోనూ ముందే ముఠా సభ్యులు పోలీసులకు చిక్కడంతో బాధితులకు ప్రమాదం తప్పినట్లరుుంది. పోలీసులు సకాలంలో స్పందించకుంటే రెండు హత్యలు, ఒక కిడ్నాప్ జరిగి ఉండేదని తెలుస్తోంది.