doctor suspend
-
జవాన్లపై ట్వీట్.. క్షమాపణలు కోరిన డాక్టర్
న్యూఢిల్లీ : తను చేసిన అనాలోచిత వ్యాఖ్యలపై ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ డాక్టర్ మధు తోట్టపిల్లిల్ క్షమాపణలు కోరారు. చైనా- భారత్ బలగాల మధ్య సంఘర్షణపై అసంబద్ద ట్వీట్ చేసినందుకు తనను క్షమించాలని వేడుకున్నారు. భారత్- చైనా మధ్య జరుగుతున్న పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని డాక్టర్ మధు స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘జూన్ 16న నేను ఓ ట్వీట్ చేశాను. నేను మాట్లాడిన తీరు. ఉపయోగించిన పదాలు తప్పని తెలిశాక వాటిని డిలీట్ చేశాను. కానీ అప్పటికి నా ట్వీట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నా దేశం గొప్పది. ఎంతో మంది సైనికులను, వీర జవానులను కలిగి ఉంది. వారిని తక్కువ చేసే ఉద్ధేశం లేదు. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న సాహసోపేతమైన కృషిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను’ అంటూ ఆయన క్షమాపణ నోట్లో రాశారు. (రోహిత్‌ను అమ్మాయిగా మార్చేశాడు..! ) అలాగే తన పోస్ట్ వేలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తనకు అర్థమైందని తోట్టపిల్లిల్ పేర్కొన్నారు. ‘నా ట్వీట్ చదివిన చాలా మంది బాధపడి ఉంటారు. వారందరినీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. పొరపాటున ట్వీట్ చేశాను. దీనికి ఎవరితోనూ, ఏ సంస్థతో సంబంధం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జవాన్ల కోసం ప్రధానమంత్రి తీసుకున్న రక్షణ గురించి నాకు తెలుసు. వీరు లేకుండా మనం సురక్షితంగా జీవించలేము. ఇక్కడితో ఈ సమస్య ముగిసిపోతుందని ఆశిస్తున్నా. మరోసారి నా అనాలోచిత మాటలకు క్షమించండి’ అంటూ ముగించారు. (జవాన్ల మరణంపై ట్వీట్: డాక్టర్ సస్పెన్షన్) Apology .... On 16th June, I had put out a tweet, and after I realised that the words used by me was inappropriate and unintended. I deleted the same. But by then there were screenshots of my tweet being circulated and shared in social media. It was never my intention to .1/5 pic.twitter.com/nvC7FjMFGl — Dr. Madhu Thottappillil (@itsmadhu) June 18, 2020 కాగా లఢఖ్‌లోని గాల్వన్ లోయలో ఈనెల 15న చైనా-భారత్ మధ్య జరిగిన సంఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరుల త్యాగాలను లెక్క చేయకుండా సీఎస్‌కు చెందిన డాక్టర్ మధురాజకీయంగా దుమారం లేపుతూ ట్వీట్ చేశాడు. ‘అమరులైన జవాన్ల శవపేటికలకు పీఎం కేర్స్ అనే స్టికర్లు అతికించి తీసుకొస్తారా. తెలుసుకోవాలని ఉంది’. అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మధు చేసిన ట్వీట్ వివాదస్పదమవ్వడంతో తర్వాత కాసేపటికి ట్వీట్ డిలీట్ చేసి అకౌంట్‌ను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. అప్పటికే సీఎస్కే జట్టు అతనిపై వేటు వేసింది. తొట్టపిల్లిల్ మధు చేసిన ట్వీట్ అతడి వ్యక్తిగత నిర్ణయమంటూ.. ఆ ట్వీట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఏ సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే టీమ్ డాక్టర్ హోదా నుంచి మధును సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్కే తమ అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది. (సరిహద్దు వివాదం: రాహుల్‌పై బీజేపీ ఫైర్) -
జవాన్ల మరణంపై ట్వీట్: డాక్టర్ సస్పెన్షన్
న్యూఢిల్లీ : చైనా బలగాలు అక్రమంగా భారత్ భూభాగంలో చొరబడి 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటనపై యావత్ దేశం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. చైనా దుశ్చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు వీరజవాన్ల మరణాలను, కేంద్ర ప్రభుతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు ఇష్టానుసారంగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఇలా ట్వీట్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డాక్టర్ మధుపై వేటు పడింది. (కల్నల్ సంతోష్ సోదరి శృతి కన్నీటిపర్యంతం) 20 మంది భారత జవాన్ల వీరమరణాన్ని కించపరుస్తూ డాక్టర్ మధు ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డాక్టర్ మధు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. భారతీయ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా డాక్టర్ మధు చేసిన ట్వీట్‌పై విచారం వ్యక్తం చేస్తూ ఆయనను సస్పెండ్ చేసినట్లు సీఎస్కే అధికారికంగా ప్రకటించింది. ('వారి త్యాగం మనోవేదనకు గురి చేసింది') సోషల్ మీడియాలో వైరల్ అయిన డాక్టర్ మధు చేసిన ట్వీట్ డాక్టర్ ట్వీట్‌కు సీఎస్కే రియాక్షన్ -
చిన్నారుల మరణం; వైద్యుడిపై వేటు
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో (ఎస్‌కెఎంసిహెచ్) చేరిన 109 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వీరికి సరైన చికిత్స అందించకుండా పిల్లల మరణాలకు కారణమైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ భీమ్సేన్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా అక్కడి పరిస్థితుల మీద అధ్యయనం చేయడానికి వైద్యారోగ్య శాఖ జూన్ 19న పట్నా మెడికల్ కాలేజీకి చెందిన పిల్లల వైద్యుడిని నియమించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి వల్ల 145 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ముంబైకి చెందిన వాలంటీర్ డాక్టర్ రవికాంత్ సింగ్ మాట్లాడుతూ.. 'బిహార్‌లో ఉన్న పేదరికం కారణంగా ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పోషకాహారలేమి, సరైన వైద్య సదుపాయం, పరిశుభ్రత లేకపోవడం వల్ల డాక్టర్లు వ్యాధులను నయం చేయలేకపోతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు, వ్యాధులపై అవగాహన రానిదే తామేమీ చేయలేమని కేజ్రీవాల్ ఆసుపత్రి ట్రస్ట్ నిర్వాహక కార్యదర్శి రాజ్‌కుమార్ గోయెంకా పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ ఆసుపత్రిలోనూ మరో 20 మంది పిల్లలు ఇదే వ్యాధితో మరణించినట్లు తెలిసింది. అధికారికంగా 145 మంది పిల్లలు మరణించినట్లుగా లెక్కలు చూపిస్తున్నా.. అనధికారికంగా 180మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
డాక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
హిందూపురం టౌన్ : ఆశావర్కర్‌ను దూషించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ సీపీఎం, సీఐటీయూ, ఆశా వర్కర్లు మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు వైద్యురాలు మాధవి పరిగికి చెందిన ఆశా వర్కర్ పద్మను‘చెప్పుతో కొడతా’ అంటూ దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న ఆశావర్కర్లను దూషించిన డాక్టర్‌పై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంఓ రుక్మిణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, రాజప్ప, రాము, లింగారెడ్డి, మారుతీ, ఆశావర్కర్లు భాగ్యలక్ష్మి, జయమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.