ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ : చైనా బలగాలు అక్రమంగా భారత్ భూభాగంలో చొరబడి 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటనపై యావత్ దేశం ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. చైనా దుశ్చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు వీరజవాన్ల మరణాలను, కేంద్ర ప్రభుతాన్ని కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు ఇష్టానుసారంగా పోస్ట్‌లు చేస్తున్నారు. ఇలా ట్వీట్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డాక్టర్ మధుపై వేటు పడింది. (కల్నల్ సంతోష్ సోదరి శృతి కన్నీటిపర్యంతం)
20 మంది భారత జవాన్ల వీరమరణాన్ని కించపరుస్తూ డాక్టర్ మధు ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డాక్టర్ మధు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. భారతీయ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా డాక్టర్ మధు చేసిన ట్వీట్‌పై విచారం వ్యక్తం చేస్తూ ఆయనను సస్పెండ్ చేసినట్లు సీఎస్‌కే అధికారికంగా ప్రకటించింది. ('వారి త్యాగం మనోవేదనకు గురి చేసింది')
సోషల్ మీడియాలో వైరల్ అయిన డాక్టర్ మధు చేసిన ట్వీట్
డాక్టర్ ట్వీట్‌కు సీఎస్‌కే రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment