Doctors research
-
వంటింటి వైద్యంతో కరోనా ‘ఆవిరి’
సాక్షి, అమరావతి: వంటింటి చిట్కాలే కరోనా నియంత్రణకు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. చివరకు అంతిమ నిర్ణయంగా చెప్పుకొనే వైద్యశాస్త్రం కూడా దీనివైపే మొగ్గుచూపడం గమనార్హం. కరోనా వైరస్ నియంత్రణకు తాజాగా ఆవిరి చికిత్స (స్టీమ్ థెరపీ) ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వైద్యులు 3 నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ఆస్పత్రికి చెందిన డా.దిలీప్‌పవార్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు.. ► పలువురు కోవిడ్ పాజిటివ్ పేషెంట్లపై స్టీమ్ థెరపీ ప్రయోగం. ► అసింప్టమాటిక్ (ఎలాంటి లక్షణాల్లేని) పాజిటివ్ బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరితగతిన కోలుకున్నారు. ► సాధారణంగా ఇది హోం రెమిడీ (ఇంటి చిట్కా) అయినా కోవిడ్ సమయంలో బాగా ఉపయోగపడుతోంది. ► పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. ► మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేయగా మూడు రోజుల్లోనే కోలుకున్నారు. ► అదే లక్షణాలుండి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలో సాధారణ స్థితికొచ్చారు. ► కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో ఆవిరి చికిత్స చేశారు. -
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
ఒకరు మృతి.. మరో కేసు నమోదు సాక్షి, హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ వైరస్ మళ్లీ నగరంలో స్వైరవిహారం చేస్తోంది. ఫ్లూజ్వరంతో బాధపడుతూ పది రోజుల నుంచి ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ ఆసిఫ్(23) శనివారం మృతి చెందగా, తాజాగా మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో మరో కేసు నమోదైంది. నగరంలో ఇప్పటికే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 రోజుల్లోనే 16 ఫ్లూ అనుమానిత కేసులు న మోదు కావడం విశేషం. గ్రేటర్ వాతావరణంలో 18 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్లు స్వైర విహారం చేస్తున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒక సారి వాతారణంలోకి ప్రవేశించిన వైరస్ సాధారణంగా రెండు, మూడు గంటలకు మించి బతకదు. నగరంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండానే వైరస్ విస్తరిస్తూనే ఉంది. స్వైన్ ఫ్లూతో రైతు మృతి మొయినాబాద్: స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఓ రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్(29)కు దగ్గు, జ్వరం రావడంతో ఈనెల 6వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు 15 రోజులపాటు ఆసిఫ్‌కు వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందాడు.