ఒకరు మృతి.. మరో కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : స్వైన్‌ఫ్లూ వైరస్ మళ్లీ నగరంలో స్వైరవిహారం చేస్తోంది. ఫ్లూజ్వరంతో బాధపడుతూ పది రోజుల నుంచి ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ ఆసిఫ్(23) శనివారం మృతి చెందగా, తాజాగా మలక్‌పేట్ యశోదా ఆస్పత్రిలో మరో కేసు నమోదైంది. నగరంలో ఇప్పటికే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22 రోజుల్లోనే 16 ఫ్లూ అనుమానిత కేసులు న మోదు కావడం విశేషం. గ్రేటర్ వాతావరణంలో 18 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌లు స్వైర విహారం చేస్తున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒక సారి వాతారణంలోకి ప్రవేశించిన వైరస్ సాధారణంగా రెండు, మూడు గంటలకు మించి బతకదు. నగరంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండానే వైరస్ విస్తరిస్తూనే ఉంది.
స్వైన్ ఫ్లూతో రైతు మృతి
మొయినాబాద్: స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఓ రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్(29)కు దగ్గు, జ్వరం రావడంతో ఈనెల 6వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు 15 రోజులపాటు ఆసిఫ్‌కు వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
Published Sun, Nov 23 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement