
సాక్షి, హైదరాబాద్ : మలక్ పెట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి సోమవారం రాత్రి బలవన్మరణం చెందారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి(60) కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 6వ తేదీన మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న గదిలోని వాష్‌రూమ్‌కు వెళ్లి ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రి సిబ్బంది గమనించి చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా చనిపోయిన వ్యక్తిని రవీందర్ రాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment