DOKKA manikyavaraprasad
-
ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు
-
నాపై ఐదుసార్లు దాడికి యత్నించారు: ఎంపీ సురేష్
సాక్షి, గుంటూరు: పక్కా ప్రణాళికతోనే టీడీపీ కార్యకర్త బత్తుల పూర్ణచంద్రరావు మారణాయుధాలతో తనపై దాడికి యత్నించాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దళిత వ్యక్తి ఎంపీగా ఎన్నికకావడాన్ని జీర్ణించుకోలేక, ఇప్పటికే తనపై ఐదుసార్లు దాడికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసు పెడితే గంటలో బయటకు వస్తా, కోర్టుకు వెళితే ఒక రోజులో బయటికి వస్తా’’ అంటూ పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నారని, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. కాగా తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఎంపీ సురేష్‌పై దాడికి యత్నించిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. (చదవండి: ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం) ముక్తకంఠంతో ఖండిస్తున్నాం ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్త దాడిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయనను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇది హేయమైన చర్య ఒక దళిత వ్యక్తి ఎంపీ అయితే ఇంత అసూయ ఎందుకు? రాజధానిలో భూస్వాములే ఉండాలా? అని ప్రశ్నించారు. దళితులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏఎన్‌యూ : అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. నవనిర్మాణాత్సోవాల్లో భాగంగా శనివారం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఆధ్వర్యంలో అశాస్త్రీయ - విభజన- రెండేళ్లలో రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. కార్యక్రమానికి వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ జాన్‌పాల్, ప్రిన్సిపాల్ సిద్ధయ్య, దూరవిద్య పరీక్షల కో-ఆర్డినేటర్ వేదయ్య తదితరులు పాల్గొన్నారు.