రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం | Navyandhra division of the state of extreme injustice | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం

Published Sun, Jun 5 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం

రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం

మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్
 
ఏఎన్‌యూ :  అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. నవనిర్మాణాత్సోవాల్లో భాగంగా శనివారం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఆధ్వర్యంలో అశాస్త్రీయ - విభజన- రెండేళ్లలో రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. కార్యక్రమానికి వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ జాన్‌పాల్, ప్రిన్సిపాల్ సిద్ధయ్య, దూరవిద్య పరీక్షల కో-ఆర్డినేటర్ వేదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement