Domestic brands
-
టాప్–100 గ్లోబల్ బ్రాండ్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ముంబై: దేశీ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ’ వరుసగా నాలుగోసారి ‘బ్రాండ్జెడ్’ రూపొందించిన 2018 ఏడాది టాప్–100 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. 60వ స్థానంలో నిలిచింది. దీని బ్రాండ్ విలువ 20.8 బిలియన్ డాలర్లు. జాబితాలో చోటు దక్కిన ఏకైక దేశీ బ్రాండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్. 2015 నుంచి.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 స్థానాలు మెరుగుపడింది. 2017లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 63వ స్థానంలో నిలిచింది. అప్పుడు దీని బ్రాండ్ విలువ 17.13 బిలియన్ డాలర్లు. 2015లో బ్యాంక్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ జాబితాలో గూగుల్ టాప్‌లో ఉంది. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెన్సెంట్, ఫేస్బుక్, వీసా, మెక్‌డొనాల్డ్స్, అలీబాబా, ఏటీ అండ్ టీ టాప్–10లో ఉన్నాయి. -
భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్
విదేశీ బ్రాండ్లదే హవా.. చిట్టచివరిలో దేశీ బ్రాండ్లు.. న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సో (ఐపీఎస్ఓఎస్) నివేదిక ప్రకా రం.. గూగుల్ తర్వాతి స్థానాల్లో ఫేస్బుక్, జి-మెయిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, వాట్స్యాప్లు ఉన్నాయి. ఇవ్వన్నీ కూడా విదేశీ బ్రాండ్లే. అంటే టాప్-6లో ఏ ఒక్క దేశీ బ్రాండ్ కూడా స్థానం పొందలేదు. జాబితాలో స్థానం పొందిన దేశీ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ టాప్‌లో ఉంది. ఇది ఏడవ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన అమెజాన్ 8వ స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో ఎస్బీఐ (9వ స్థానం), ఎయిర్టెల్ (10వ స్థానం) ఉన్నాయి.