ముంబై: దేశీ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్‌డీఎఫ్‌సీ’ వరుసగా నాలుగోసారి ‘బ్రాండ్‌జెడ్’ రూపొందించిన 2018 ఏడాది టాప్–100 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. 60వ స్థానంలో నిలిచింది. దీని బ్రాండ్ విలువ 20.8 బిలియన్ డాలర్లు. జాబితాలో చోటు దక్కిన ఏకైక దేశీ బ్రాండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. 2015 నుంచి.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 స్థానాలు మెరుగుపడింది.
2017లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 63వ స్థానంలో నిలిచింది. అప్పుడు దీని బ్రాండ్ విలువ 17.13 బిలియన్ డాలర్లు. 2015లో బ్యాంక్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ జాబితాలో గూగుల్ టాప్‌లో ఉంది. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెన్‌సెంట్, ఫేస్‌బుక్, వీసా, మెక్‌డొనాల్డ్స్, అలీబాబా, ఏటీ అండ్ టీ టాప్–10లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment