Domestic capital markets
-
పీనోట్ల పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ(పీ) నోట్ల పెట్టుబడులు గత నెల(ఏప్రిల్)లో రూ. 95,911 కోట్లను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. గత రెండు నెలలుగా పీనోట్ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇంతక్రితం 2022 నవంబర్‌లో పీనోట్ పెట్టుబడులు రూ. 96,292 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం తాజా పెట్టుబడులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(పీఎఫ్‌ఐలు) వీటిని జారీ చేస్తుంటారు. ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే విదేశీ ఇన్వెస్టర్లకు వీటిని ఎఫ్‌పీఐలు జారీ చేసే సంగతి తెలిసిందే. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాక మాత్రమే వీటిని జారీ చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దేశీయంగా ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ పెట్టుబడుల విలువ ఏప్రిల్ చివరికల్లా రూ. 95,911 కోట్లను తాకింది. మార్చి నెలాఖరుకు ఈ విలువ రూ. 88,600 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరికల్లా ఇవి రూ. 88,398 కోట్లుకాగా.. జనవరి చివరిలో రూ. 91,469 కోట్లకు చేరాయి. వెరసి మార్చిలో స్వల్పంగా పుంజుకోగా.. ఏప్రిల్‌లో భారీ వృద్ధి నమోదైంది. తాజాగా నమోదైన పెట్టుబడుల్లో రూ. 86,226 కోట్లు ఈక్విటీలలోకి ప్రవేశించాయి. ఈ బాటలో రూ. 9,586 కోట్లను రుణ పత్రాలలో ఇన్వెస్ట్ చేయగా, మరో రూ. 100 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల కొనుగోలుకి విదేశీ ఇన్వెస్టర్లు వెచ్చించారు. -
పీనోట్ల పెట్టుబడులు డీలా..
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ(పీ) నోట్ల ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు మే నెలలో వెనకడుగు వేశాయి. రూ. 86,706 కోట్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు నెల అంటే 2022 ఏప్రిల్‌లో ఇవి రూ. 90,580 కోట్లుగా నమోదయ్యాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు, హైబ్రిడ్ సెక్యూరిటీల నుంచి గత నెలలో దాదాపు రూ. 4,000 కోట్ల పీనోట్ పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పీనోట్లను జారీ చేస్తుంటారు. వీటి ద్వారా విభిన్న విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిజిస్ట్రేషన్ లేకుండానే దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట వీడి దేశీ స్టాక్స్‌లో తిరిగి పెట్టుబడులు చేపట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈక్విటీలకే అధికం ఈ ఏడాది(2022) మార్చికల్లా పీనోట్ పెట్టుబడులు రూ. 87,979 కోట్లకు చేరగా.. ఫిబ్రవరిలో ఇవి రూ. 89,143 కోట్లు, జనవరిలో రూ. 87,989 కోట్లను తాకాయి. గత నెల పెట్టుబడుల్లో రూ. 77,402 కోట్లు ఈక్విటీలలో, రూ. 9,209 కోట్లు రుణ సెక్యూరిటీలలో, మరో రూ. 101 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీలలోనూ నమోదయ్యాయి. అయితే ఏప్రిల్ పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా రూ. 81,571 కోట్లుకాగా.. రూ. 8,889 కోట్లు రుణ సెక్యూరిటీలకు మళ్లాయి. పదేళ్ల కాలపు ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో ఇటీవల ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు గ్రీన్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్ శర్మ పేర్కొన్నారు. పీనోట్ ఇన్వెస్ట్మెంట్స్ నీరసించిన నేపథ్యంలో ఎఫ్‌పీఐల కస్టడీలో ఉన్న ఆస్తుల(పెట్టుబడులు) విలువ సైతం మే నెలలో 5 శాతం క్షీణించి రూ. 48.23 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ చివరికల్లా ఈ విలువ రూ. 50.74 లక్షల కోట్లను తాకింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ. 40,000 కోట్లు, రుణ మార్కెట్ల నుంచి రూ. 5,505 కోట్ల పెట్టుబడులు వాపస్ తీసుకోవడం గమనార్హం! -
జూన్‌లో పెట్టుబడులు రూ. 26,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. జూన్ నెలలో ఇప్పటివరకూ రూ. 26,165 కోట్లను(4.42 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ లభించడంతోపాటు, నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణాత్మక చర్యలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 10,359 కోట్లు, రుణ(డెట్) మార్కెట్లో రూ. 15,806 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 4% పుంజుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఎఫ్ఐఐలు ఓవైపు ఈక్విటీలలో నికరంగా రూ. 56,163 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, మరోపక్క రూ. 61,925 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. ఇవి దాదాపు 20 బిలియన్ డాలర్లకు(రూ. 1.18 లక్షల కోట్లు) సమానం.