మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన వందనపు స్వరాజ్య లక్ష్మి జ్ఞాపకార్థం భర్త వందనపు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు.