donations to political parties
-
ఆ విరాళాల వివరాలు మాకివ్వండి: ఈసీ
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల వివరాలను నవంబర్ 15 సాయంత్రంలోగా అందించాలని పారీ్టలను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అందిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో నివేదించాలని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ఈనెల రెండో తేదీన ఆదేశించిన నేపథ్యంలో ఈసీ పై విధంగా స్పందించింది. ‘‘ ఒక్కో ఎలక్టోరల్ బాండ్ విలువ ఎంత? ఆ బాండ్ విలువలో ఎంత మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు? మొత్తం ఎన్ని బాండ్లు మీకు వచ్చాయి? మొత్తం బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాలు..’ ఇలా ప్రతీదీ సవివరంగా పేర్కొంటూ జాబితాను డబుల్ సీల్డ్ కవర్లో సమరి్పంచండి’’ అంటూ ఆయా పారీ్టల చీఫ్‌లకు ఈసీ లేఖలు పంపింది. -
ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల్లో బీజేపీ టాప్.. రెండోస్థానంలో టీఆర్ఎస్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి విరాళాల వరద పారింది. ఎలక్టరోల్ ట్రస్టులకు(ఈటీ) వచ్చిన కార్పొరేట్, వ్యక్తిగత విరాళాల్లో 72 శాతానికిపైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పోల్ రైట్స్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 2021-22 ఆర్థిక ఏడాదికి గల ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల వివరాలను వెల్లడించింది. 2021-22 ఏడాదిలో బీజేపీకి అత్యధికంగా రూ.351.50 కోట్ల విరాళాలు ఈటీల ద్వారా అందాయి. మొత్తం పార్టీలు అందుకున్న విరాళాలతో పోలిస్తే బీజేపీకే 72.17 శాతం అందినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ద ఫ్రుడెండ్ ఎలక్టరోల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.336.50 కోట్లు బీజేపీకి విరాళంగా అందించింది. అంతకు ముందు ఏడాది 2020-21లో రూ.209 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే.. 2021-22 ఏడాదిలో ఏపీ జనరల్ ఈటీ, సమాజ్ ఈటీ వరుసగా రూ.10కోట్లు, రూ.5 కోట్లు బీజేపీకి అందించాయి. రెండోస్థానంలో టీఆర్ఎస్.. బీజేపీ తర్వాత రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిలిచింది. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు ఒక్కదాని నుంచే రూ.40 కోట్లు అందాయి. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రూ.18.43 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.21.12 కోట్లు ట్రస్టుల ద్వారా అందాయి. ఇండిపెండెంట్ ఈటీ నుంచి ఆప్ పార్టీకి రూ.4.81 కోట్లు అందిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది చీపురు పార్టీ. అలాగే.. స్మాల్ డొనేషన్స్ ఈటీ నుంచి కాంగ్రెస్‌కు 1.9351 కోట్లు అందాయి. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు 9 రాజకీయ పార్టీలకు విరాళాలు అందించింది. అందులో టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు ఉన్నాయి. మరో ఆరు ఎలక్టరోల్ ట్రస్టులు 2021-22 ఏడాదికి గానూ రూ.487.0856 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపాయి. అందులో రూ.487.0551 కోట్లు(99.994శాతం) వివిధ రాజకీయ పార్టీలకు అందించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ పార్టీకి ఎంత ఇచ్చామనే వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజిస్టర్ అయిన 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 16 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 7 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
కోవిడ్ ఎఫెక్ట్.. బీజేపీకి భారీగా తగ్గిన విరాళాలు.. కాంగ్రెస్‌కు ఎంతంటే?
ఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. కోవిడ్ సమయంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు దాదాపుగా సగం మేర తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గిపోయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆ విలువ 41.49 శాతం తక్కువగా పేర్కొంది. బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 39.23 శాతం తగ్గి రూ.477.54కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 46.39శాతం తగ్గి రూ.74.52 కోట్లు మాత్రమే అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు రూ.246 కోట్లు విరాళంగా వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68 కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్లు అందాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు.. విరాళాల్లో 80 శాతాన్ని ఆక్రమించగా.. మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు అందాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం రూ.480 కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చాయి. మరోవైపు.. రూ.111 కోట్లు విరాళాలు 2,258 మంది వ్యక్తులు అందించారు. సుమారు రూ.37 కోట్ల విరాళాలకు సరైన ఆధారాలు లేకపోవటం వల్ల ఏ రాష్ట్రం నుంచి వచ్చాయనే వివరాలు వెల్లడికాలేదు. బీజేపీకి మొత్తం 1,100 విరాళాలు కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ల నుంచి వచ్చాయి. కాంగ్రెస్‌కు 146 విరాళాలు వచ్చాయి. ఇదీ చూడండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్.. 18 మంది బహిష్కరణ -
డిసెంబర్‌లోపే ఐటీ రిటర్నులు
► లేకుంటే పన్ను మినహాయింపు కోల్పోయే ప్రమాదం ► రాజకీయ పార్టీల విరాళాలపై కేంద్రం చట్ట సవరణ! న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలన్నీ తమకొచ్చే విరాళాలపై ప్రతి ఏడాదీ డిసెంబర్‌లోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్ట సవరణ చేయనుంది. అలా దాఖలు చేయని పక్షంలో పన్ను మినహాయింపును కోల్పో యే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకుల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లను కొని పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తి గుర్తింపును రహస్యంగా ఉంచేలా చట్టాన్ని మార్చనున్నారు. దీనిపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు పన్ను మినహాయింపును అనుభవిస్తున్నాయని, కానీ సగంపైగా పార్టీలు సరైన సమయంలో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకొచ్చే విరాళాలపై పారదర్శకత పెంచేందుకు డిసెంబర్‌లోపు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేసేలా 2017–18 బడ్జెట్లో ఆర్థిక బిల్లు ద్వారా చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పా రు. ఉదాహరణకు 2018–19 అంచనా సంవత్సరానికి గాను(2017, ఏప్రిల్ 1 నుం చి ఆర్థిక సంవత్సరం ప్రారంభం) డిసెంబర్ 31, 2018లోపు రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలా చేయని పార్టీలకు పన్ను మినహాయింపును రద్దు చేసేలా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.