Dondakaya
-
Health Tips: దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా?
Health Tips in Telugu: ఏ సీజన్లో అయినా విరివిగా దొరికే వాటిలో ముందుండేది దొండకాయ. సాధారణంగా ఇది చౌకగానే దొరుకుతుంది. దొండకాయతో వేపుళ్లు, కూరలు చేనుకుంటారు. గుత్తి వంకాయ లాగే దొండకాయలను కూడా నాలుగు పక్షాలుగా చీరి అందులో పూర్ణం కూరి కాయలు కాయలు కూర చేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. బాలింతలకు, జ్వరం వచ్చి తగ్గిన వారికి దొండకాయ కూరను పథ్యంగా పెడతారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో ఒక కప్పు మేర దొండకాయను తీసుకుంటే డయాబెటిస్‌ను నిరోధించే వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. దొండ ఆకుల పేస్టును మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు వుండవు. జలుబు, దగ్గును కూడా దొండ నయం చేస్తుంది. శరీరం నుంచి మలినాలను చెమట ద్వారా వెలివేస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? ►దొండకాయ రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ►పీచు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ►ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. ►దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►దొండలో ఉండే బి–విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది. ►మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండకాయ చక్కటి పరిష్కారం. ►దీనిలోని క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ►ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా దొండకాయను వారానికి మూడు సార్లకు మించకుండా తీసుకోవటమే మంచిది. చదవండి: Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు! Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల..
అతివల అదరాల అందాన్ని వర్ణించాలంటే.... ఈ కూరగాయను అరువు తెచ్చుకోవాల్సిందే! అవును.. మరి దొండపండు లాంటి పెదవే నీది అంటే చాలదా! ఎంతటి కోపమైనా ఇట్టే మాయమైపోతుంది. అయితే, కేవలం ఈ ఉపమానాలకే వరకే దొండకాయను సరిపెట్టేయకండి! దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. సాధారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దొండకాయను ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో దొండకాయలతో కూరలతో పాటు.. వేపుడు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం లేత దొండకాయలను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు, దొండ ఆకులను కూడా తింటారు. దొండకాయలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు ►దొండకాయల్లో పీచు పదార్థాలు పుష్కలం. ►అదే విధంగా.. బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటివి ఉంటాయి. ►స్వల్పంగా పిండి పదార్థాలు కూడా ఉంటాయి. ►క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు దొండకాయలో ఉంటాయి. దొండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ►రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం దొండకాయలకు ఉంటుంది. ►ఇవి జీర్ణకోశానికి మేలు చేకూరుస్తాయి. ఇందులోని పీచు పదార్థాలు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా తోడ్పడతాయి. ►అంతేగాక రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి. కాబట్టి దొండకాయ రసం తాగితే ప్రయోజనం ఉంటుంది. ►ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ►కాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తాయి. ఇక ఇందులోని బేటా కెరోటిన్ విటమిన్- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
రుచిగా లేదనుకుంటే నష్టపోతాం
పాపం... దొండకాయను కాకి ముక్కుతో జత చేసేప్పుడు మనమిచ్చే ప్రాధాన్యం.. దాన్ని కూరగా పరిగణించినప్పుడు అంతగా ఇవ్వం. కానీ కాకి విషయంలో దాని అందం ఎంతో... తిండి విషయంలో దాంతో వచ్చే ఆరోగ్యమూ అంతే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అంతగా రుచించదంటూ దొండను ముట్టకపోతే మనమే అజ్ఞానకాకులం అవుతామంటున్నారు కాకలు దీరిన ఆహారనిపుణులు. దొండకాయతో మనకు సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. దొండకాయ ఒంట్లో విడుదలయ్యే చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే ఇది డయాబెటిస్ రోగులకు మంచిది. క్రమం తప్పకుండా దొండకాయ తినేవారిలో చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. కొవ్వుగా మారే ప్రీ–అడిపోసైట్స్ అనే కణాలను దొండకాయ సమర్థంగా నివారిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దొండలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత (అనీమియా) తగ్గుతుంది. ఐరన్ లేమి వల్ల వచ్చే నిస్సత్తువ కూడా మాయమవుతుంది.దొండ వల్ల కేంద్ర నాడీమండలం బలం పుంజుకుంటుంది. మెదడుకూ మంచిది. ఇది మూర్ఛ (ఎపిలెప్సీ), అలై్జమర్స్ వంటి వాటిని చాలావరకు నివారిస్తుంది. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే మణికట్టు నొప్పి కలిగించే జబ్బుకు దొండకాయ స్వాభావికమైన చికిత్సగా చాలామంది వైద్యులు పరిగణిస్తుంటారు. దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండకాయ మూత్రపిండాల్లో రాళ్లను సమర్థంగా నివారిస్తుంది. దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండకాయలో సాపోనిన్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల అది ఎన్నో రకాల అలర్జీలను నివారిస్తుంది. దొండలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది. దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది. దొండలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ చాలా మంచిది. హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా అది గుండెజబ్బులనూ అరికడుతుంది. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది. -
దొండకాయ
గుడ్‌ఫుడ్ మనకు జ్వరం వచ్చి నార్మల్ అయ్యే సమయంలో తీసుకొమ్మని చెప్పే కూరగాయల్లో దొండకాయ ఒకటి. జ్వరం వల్ల మనం కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగి వచ్చేలా చేసే అద్భుతమైన కూరగాయ దొండ. దానివల్ల ఒనగూరే మరికొన్ని ఇతర ప్రయోజనాలివి... దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండలో ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది.దొండలోని యాస్కార్బిక్ యాసిడ్ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు.శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది.దొండలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ శ్రేయస్కరం. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది.