doneted
-
ప్రాణం కోసం.. పన్నెండేళ్ల పోరాటం
జూలపల్లి(పెద్దపల్లి): వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడతాయని 12 ఏళ్లుగా ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి చేతిలో ఉన్నకాడికి ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయి నా తగ్గని వ్యాధి తమ కుమారుడిని ఎక్కడ పొట్టనపెట్టుకుంటుందోనని ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జూలపల్లికి చెందిన వడ్లూరి చంద్రమౌళి– స్వరూపలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాహుల్(16)కు 12 ఏళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. అప్పట్లో అప్పు లు తెచ్చి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించారు. డాక్లర్లు 12 ఏళ్లపాటు మందులు వాడి తిరిగి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కొంత మేరకు దాతల సహకారం అందడంతో మందులు వాడుతూ వచ్చారు. అప్పట్లో చేసిన అప్పులు నేటికి తీరకపోగా వారి వద్ద ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేదు. వైద్య పరీక్షలకు వెళ్లక పోవడంతో నెల రోజుల నుంచి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని పరిస్థితికి వచ్చాడు. మలమూత్రాలు సైతం మంచంలోనే సాగుతున్నాయి. పరీక్షలకు కనీసం రూ.30 వేలు అవసరం ఉంటాయని, కూలీ చేసుకుని జీవనం సాగించే తమవద్ద ఆ డబ్బులు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని అతని తల్లిదండ్రులు దీనంగా చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్ సోకిన తమ 16 ఏళ్ల కుమారుడికి వైద్యం చేయించుకోలేని స్థితితో ఆ నిరుపేద కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు స్పందించి తమ కుమారుని ప్రాణాలు కాపాడాలని వారు వేడుకుంటున్నారు. దాతలు సెల్: 7799816260కు సంప్రదించగలరు. -
పాఠశాలలకు మంచినీటి ట్యాంక్‌ల బహూకరణ
కోదాడఅర్బన్: పట్టణంలోని ఆజాద్‌నగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అంబేద్కర్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిమిర్యాల ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యం కోసం శనివారం వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో మంచినీటి వాటర్‌ట్యాంక్‌లను అందజేశారు. అదే విధంగా అమీనాబాద్ పాఠశాలకు 20కుర్చీలతో పాటు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. వాసవీక్లబ్స్ జిల్లా గవర్నర్ బండారు వెంకటేశ్వర్లు వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్స్ క్యాబినెట్ కార్యదర్శి బుక్కా వెంకయ్య, క్లబ్స్ నిర్వాహకులు పబ్బా గీత, బొగ్గారపు రేఖారాణి, వి.రమ, శ్రీలక్ష్మి, శ్రీదేవి, వై.రాణి, క్రాంతికుమారి, గీత, రాధిక, సుశీల, ఉమ, అనురాధ, నళినిశ్రీ, ఝూన్సీ, సీత, మణి, ప్రమీల, సుజాత తదితరులు పాల్గొన్నారు.