door mats
-
వ్యర్థాలతో విలువైన అల్లికలు!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ముఖ్యమైన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఒకటి. పచ్చదనంతో కళకళలాడే పర్యాటక ప్రాంతాలకు సైతం ఈ ప్లాస్టిక్ భూతం పెనుసమస్యగా పరిణమిస్తోంది. ఆయా పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు.. వివిధ రకాల పనులకోసం ఉపయోగించే వస్తువుల్లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారైనవే. రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యం పై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. దీనిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమస్య కు అత్యంత సులభమైన పరిష్కారం చూపడంతోపాటూ, నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు అసోంకు చెందిన రూప్‌జ్యోతి సైకియా గొగోయ్. అసోంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగా జాతీయ ఉద్యానవనం కూడా ప్లాస్టిక్ కాలుష్య ముప్పునకు గురవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కజిరంగా పార్క్‌ను సందర్శించే పర్యాటకులు వదిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇది గమనించిన 47 ఏళ్ల రూప్‌జ్యోతి సైకియా గోగోయ్ వీటికి చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. కజిరంగా పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటితో çహ్యాండ్ బ్యాగ్‌లు, డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, ఇతర రకాల ఫర్నీషింగ్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అంతేగాక పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి పనికొచ్చే వస్తువులు ఎలా తయారు చేయాలి– అనే అంశంపై స్థానిక నిరుపేద మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కజిరంగా హట్.. రూప్‌జ్యోతి మరికొంతమంది మహిళలç సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి.. వాటిని శుభ్రం చేసి, కత్తిరించి దారాల సాయంతో వస్తువులుగా రూపొందిస్తారు. ఇవి చూడడానికి ఆకర్షణీయంగానే గాక, మన్నికగా కూడా ఉంటాయి. కొందరు మహిళలు వీటిని రూపొందించే పనిలో ఉంటే.. మరికొందరు ఈ వస్తువులను పర్యాటకులకు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే 2012లో రూప్‌జ్యోతి ‘కజిరంగా హట్’ పేరిట ఒక అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా తయారు చేసిన వస్తువులను హట్ లో ప్రదర్శించి విక్రయిస్తుంటారు. నాలుగువేల మందికి పైగా మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటిదాకా అసోంలోని 35 గ్రామాల్లోని మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు దేశ విదేశీ పర్యాటకులకు వస్తువులు విక్రయించి నెలకు 25 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ.. ముంబైకి చెందిన ఎన్జీవో ద కార్బెట్ ఫౌండేషన్.. 2013–2017 మధ్యకాలంలో కజిరంగా పరిసర ప్రాంతాల్లోని మహిళ అభివృద్ధికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమంలో రూప్‌జ్యోతి పాల్గొని దాదాపు రెండువందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. అంతేగాక అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిబెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గోని ఇప్పటిదాక 2,300 మంది మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇచ్చారు. వెదురు పుల్లల్ని అల్లినట్లుగా... ‘‘అది 2004.. మా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ వ్యర్థాలను ఎలా రూపుమాపాలి? వీటితో పనికొచ్చేవి ఏమైనా తయారు చేయవచ్చా అని బాగా ఆలోచించాను. ఈ క్రమంలోనే కొందరు వెదురు పుల్లల అల్లికల ద్వారా రకరకాల వస్తువులు రూపొందించడం నా మదిలో మెదిలింది. వెంటనే వెదురు లాగా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అల్లవచ్చు కదా! అనుకున్నాను. వెంటనే చిన్న చిన్న టెక్నిక్‌లతో ప్లాస్టిక్ వ్యర్థాలను కాటన్ దారంతో కలిపి రకరకాల వస్తువులు రూపొందించడం మొదలుపెట్టాను. వీటిని రూపొందించడానికి నేను ఎటువంటి శి„ý ణా తీసుకోలేదు. అలా ముందు నేను నేర్చుకుని తర్వాత స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చాను. మేమందరం తయారు చేసే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తులు ఎంతో మన్నికగా ఉంటాయి’’ అని రూప్‌జ్యోతి వివరించారు. కజిరంగా హట్ వద్ద సందర్శకులు -
దేవుడి ఫొటోలతో బాత్రూం రగ్స్, డోర్మ్యాట్లు
సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్. దీంతో భారత వినియోగదారులు అమెజాన్ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్లో బాయ్‌కాట్ అమెజాన్ అనేది ట్రెండింగ్‌లో నిలిచింది. అమెజాన్ వెబ్సైట్లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్మ్యాట్లు, బాత్రూం రగ్స్ దర్శనమిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్ కనిపించాయి. దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు. ‘సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజన్లు ఘాటుగా విమర్శించారు. మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్సైట్ నుంచి తొలగింది. కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. I think Amazon USA already removed such products ... Still @amazon and other online sellers have to very careful on such products , they should develop a mechanism to check the products properly before making them online for selling. #BoycottAmazon https://t.co/A2F2lgDyCl — Arpit Bhatia (@ArpitBhatia1984) January 12, 2020 -
అమెజాన్‌కు ఇంకా బుద్ధి రాలేదా?
న్యూఢిల్లీ: భారత జాతీయ జెండా తరహా డోర్మ్యాట్లను తన కెనడా వెబ్సైట్లో అమ్మకాలకు ఉంచి తీవ్ర విమర్శల పాలైన అమెజాన్‌కు ఇంకా బుద్ధి రానట్లే అనిపిస్తోంది. ఈ వ్యవహారంలో స్వయంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగొచ్చిన అమెజాన్.. భారతీయుల మనోభావాలు దెబ్బతినే అలాంటి తప్పునే మరోసారి చేసింది. అమెజాన్ యూఎస్ వెబ్సైట్లో గాంధీజీ బొమ్మ ముద్రించి ఉన్న చెప్పులను అమ్మకానికి ఉంచింది. దీనిని గుర్తించిన ఓ ట్విట్టర్ యూజర్.. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ట్యాగ్ చేశారు. డోర్ మ్యాట్ల వ్యవహారంలో ఇది తమ తప్పిదం కాదని.. వెబ్సైట్లో వాటిని థర్డ్ పార్టీ అమ్మకానికి ఉంచిందని అమెజాన్ చెప్పుకుంది. భారతీయుల మనోభావాలు దెబ్బతినే ఇలాంటి ఉత్పత్తులను తమ వెబ్సైట్ ద్వారా అమ్మకానికి ఉంచకుండా చర్యలు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబారికి ప్రభుత్వం ఆదేశించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. -
ఓల్డ్ జూట్... న్యూ డోర్‌మ్యాట్స్...
ఇంటికి - ఒంటికి ప్రస్తుతం మనం వాడే డోర్‌మ్యాట్స్ ఒక్కో ఇంట్లో ఒక్కో వెరైటీలో ఉంటున్నాయి. అవునా.. రకరకాల డిజైన్లలో, వివిధ రంగుల్లోని మ్యాట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పుడే కాదు, పాత రోజుల్లో కూడా డోర్మ్యాట్లను వాడేవారు. అవేనండీ.. జనపనారతో చేసిన పట్టాలను కాళ్ల దగ్గర వేసుకునే వారు. అలాంటివే ఇప్పుడు మీకూ వాడాలని, అలా కొన్నేళ్ల వెనక్కి వెళ్లాలని ఉందా? అయితే జనపనారతో ఇంట్లోనే వివిధ డిజైన్లలో డోర్మ్యాట్లను తయారు చేసుకోవచ్చు ఇలా... కావలసినవి: జనపనార (జూట్), పాత డోర్‌మ్యాట్ (కొలతల కోసం), గ్లూ తయారీ విధానం: ముందుగా మీకు ఏ సైజు మ్యాట్ కావాలో అలాంటి కొలతలతో ఉన్న పాత మ్యాట్‌ను తీసుకోండి. దాని ఆధారంగా డోర్‌మ్యాట్‌ను సులువుగా తయారు చేసుకోవచ్చు. మొదట ఫొటోలో కనిపిస్తున్న విధంగా జనపనారను ఒక్కో చుట్టూ చుట్టుకుంటూ గుండ్రంగా తిప్పుకోవాలి. అంతా పూర్తి అయ్యాక, ఆ నార చివర ఒక గట్టిముడి వేయాలి. అప్పుడు అది కూడా ఓ డిజైన్లా కనిపిస్తుంది. ఆపైన గ్లూను దళసరిగా జనపనార చుట్లపై పూయాలి. దాంతో ఆ జనపనార ఒకదానికొకటి అతుక్కుంటుంది. కావాలంటే పాత మ్యాట్‌ను కొత్తదానిపై పెట్టి ఒకేలా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. గుండ్రంగానే కాకుండా ఈ జనపనారను ఫొటోల్లో కనిపిస్తున్నట్టుగా దీర్ఘచతురస్రాకారంలోనూ తయారు చేసుకోవచ్చు.