సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్. దీంతో భారత వినియోగదారులు అమెజాన్ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్ అమెజాన్ అనేది ట్రెండింగ్‌లో నిలిచింది. అమెజాన్ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్ దర్శనమిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌మ్యాట్స్ కనిపించాయి. దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు.
‘సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజన్లు ఘాటుగా విమర్శించారు. మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్‌లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్‌సైట్ నుంచి తొలగింది. కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.
I think Amazon USA already removed such products ...
— Arpit Bhatia (@ArpitBhatia1984) January 12, 2020
Still @amazon and other online sellers have to very careful on such products , they should develop a mechanism to check the products properly before making them online for selling. #BoycottAmazon https://t.co/A2F2lgDyCl
Comments
Please login to add a commentAdd a comment