Doordarshan anchor
-
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
-
ప్రముఖ వ్యాఖ్యాత, నిర్మాత కన్నుమూత.. సెలబ్రిటీల సంతాపం
Gol Maal Actress Manju Singh Passed Away At 73: ప్రముఖ హిందీ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, ప్రొడ్యూసర్ మంజు సింగ్ (73) కన్నుమూశారు. గీత రచయిత, గాయకుడు, నటుడు స్వానంద్ కిర్కిరే సోషల్ మీడియా వేదికగా మంజు సింగ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. 'మంజు సింగ్ ఇకలేరు. ఆమె దూరదర్శన్‌లో ప్రసారమయ్యే స్వరాజ్ షోకి రాసేందుకు నన్ను ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. డీడీ కోసం ఏక్ కహానీ, షో టైమ్ మొదలైన అనేక అద్భుతమైన ప్రదర్శనలు రూపొందించారు. మా ప్రియమైన మంజు గారి ప్రేమను అందరూ ఎలా మరిచిపోగలరు. వీడ్కోలు..' అని ట్వీట్ చేశారు. స్వానంద్తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, సహచరులు ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. మంజు సింగ్ భారతదేశంలోనే గొప్ప టెలివిజన్ మార్గదర్శకురాలు. స్వరాజ్, ఎక్ కహానీ, షో టైమ్ వంటి ప్రసిద్ధ షోలను నిర్మించారు. పిల్లల షో 'ఖేల్ ఖిలోన్'కు ఏడేళ్లపాటు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమెను అందరూ ప్రేమగా 'దీదీ' అని పిలిచేవారు. సింగ్ హృషికేష్ ముఖర్జీ గోల్మాల్ సినిమాలో రత్న అనే పాత్రను పోషించారు. అనేక అంతర్జాతీయ బాలల, యువకుల చలనచిత్రోత్సవాలలో మంజు సింగ్ పాల్గొన్నారు. సృజనాత్మక కళలు, విద్యకు ఆమె చేసిన సేవలకుగానూ 2015లో భారత ప్రభుత్వం మంజు సింగ్‌ను 'సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఎబీఈ)'కి నియమించింది. मंजू सिंह जी नहीं रही ! मंजू जी मुझे दिल्ली से मुंबई लायी थी दूरदर्शन के लिए उनका शो स्वराज लिखने ! उन्होंने DD के लिए कई नायब शोज़ एक कहानी, शो टाइम आदि बनाए थे . हृषिकेश मुखर्जी की फ़िल्म गोलमाल की रत्ना हमारी प्यारी मंजू जी आपका प्यार कैसे भूल सकता है .. अलविदा ! pic.twitter.com/aKFvMJeFYF — Swanand Kirkire (@swanandkirkire) April 15, 2022 చదవండి: మోహన్ లాల్ ఉదారత.. ఆ విద్యార్థులకు 15 ఏళ్లపాటు ఉచిత విద్య -
షారుక్ అరుదైన వీడియో బయటకు..
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఒక టీవీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించాడని మనందరికీ తెలిసిందే. ఆయన తొలిసారి ఫౌజీ అనే నాటికలో నటుడిగా అడుగుపెట్టాడు. ఆ తర్వాత సర్కస్ అనే పాపులర్ షో ద్వారా బాలీవుడ్ మంచి పేరు సంపాధించుకున్నారు. కానీ, ఆయన దూరదర్శన్ చానెల్లో కూడా ఉద్యోగం చేశాడని ఎంతమందికి తెలుసని అనుకుంటే చాలా తక్కువమందికే అని చెప్పాల్సి ఉంటుంది. అవును షారుక్ ఖాన్ నిజంగానే దూరదర్శన్‌లో పనిచేశారు. అది కూడా ఒక యాంకర్ గా.. ఆయన 1990నాటి కాలంలో దూరదర్శన్‌లో ప్రసారం అయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా పనిచేశారు. దానికి సంబంధించిన అత్యంత అరుదైన వీడియో ఒకటి ఇప్పుడు చాలా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్ కుమార్ సానును పరిచయం చేస్తూ ఉన్న ఈ వీడియోను ఓ అభిమాని యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. కుమార్ సోనూ కూడా ఆ రోజుల్లో ప్రముఖ సింగర్‌గా మారి మొత్తం ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నాడు. -
ప్రసారభారతిని చిక్కుల్లో పడేసిన యాంకర్
న్యూఢిల్లీ: 'గవర్నర్ ఆఫ్ ఇండియా'- దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో యాంకరమ్మ నోటి నుంచి జాలువారిన మాట ఇది. ఈ మాటే ఇప్పుడు దూరదర్శన్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అంతేకాదు మహిళా గవర్నర్ ను 'అతడు' గా సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేసింది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫీ) నవంబర్ 20న గోవాలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి... 'గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అభిప్రాయాలు మనతో పంచుకుంటారు' అని వ్యాఖ్యానించింది. ఈ వీడియా సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్ పై విమర్శలు రేగాయి. అయితే పొరపాటును సరిచేసి నాలుగు నిమిషాల తర్వాత పునఃప్రసారం చేశామని డీడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జరిగిన తప్పుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారిని ఆదేశించినట్టు చెప్పారు. 'గవర్నర్ ఆఫ్ ఇండియా' వ్యాఖ్య చేసిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని వెల్లడించారు. ఇంతకుముందు కూడా దూరదర్శన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరులోని ఎక్స్ఐ(XI)ని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్ గా పలకడంతో డీడీపై విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసి ప్రసారభారతి అభాసుపాలైంది.